నేడు జడ్చర్లకు హరీశ్‌రావు రాక
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జడ్చర్ల పట్టణంలో సర్, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ న మోదుపై నిర్వహించే అవగాహన కార్యక్రమానికి ఆయన హా జరుకానున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.
- బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై దిశానిర్దేశం చేయనున్న మాజీ మంత్రి
- ఏర్పాట్ల పర్యవేక్షణలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
- గులాబీమయంగా మారిన జడ్చర్ల పట్టణం
- మిడ్జిల్‌లో మన్యం విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల టౌ న్, జూన్ 29 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జడ్చర్ల పట్టణంలో సర్, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ న మోదుపై నిర్వహించే అవగాహన కార్యక్రమానికి ఆయన హా జరుకానున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.
ఈ మేరకు సోమవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకావాల్సి ఉండగా.. తీవ్ర జ్వ రం కారణంగా ఆయన పర్యటన రద్దయిందని, కేటీఆర్‌కు బదులు హరీశ్‌రావు వస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లడించారు. అలాగే మిడ్జిల్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుడు మన్యం వెంకట్‌రెడ్డి విగ్రహావిష్కరణ ఉంటుందని, కార్యకర్తలంతా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
గులాబీమయమైన జడ్చర్ల
ఉమ్మడి జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కార్యకర్తలను అవగాహన కల్పించడానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు సమావేశమై కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలకు పిలిపించి సభ్యత్వ నమోదును గ్రామగ్రామాన నిర్వహించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈసారి రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసి కేసీఆర్‌కు గిఫ్టుగా ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. అయితే పార్టీ సభ్యత్వ నమోదు అంతా డిజిటల్ యాప్ ద్వారా జరుగుతూ ఉండడంతో కార్యకర్తలతో ఈ యాప్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఓటరు జాబితా సవరణపై సర్ కార్యక్రమం చేపడుతుండడంతో పార్టీ తరఫున పనిచేస్తున్న బీఎల్ఏలు మొత్తంగా ఉండాలని పార్టీ నాయకత్వం సూచిస్తోంది. దీంతో జడ్చర్లలో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పార్టీ అగ్ర నాయకత్వాన్ని తీసుకొచ్చి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జడ్చర్ల పట్టణంలో అన్ని ప్రాంతాలతోపాటు జాతీయ రహదారి పొడవునా స్వాగ త బ్యానర్లు వెలిశాయి. పట్టణం మొత్తం బీఆర్ఎస్ జెండాలతో అలంకరించారు.
అనారోగ్యం కారణంగా కేటీఆర్‌కు బదులు హరీశ్‌రావు రాక
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మంగళవారం నిర్వహించనున్న బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరు కావాల్సి ఉన్నది. వారం రోజుల కిందటే ఆయన పర్యటన ఖరారైంది. ఈలోపు కేటీఆర్ జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో పర్యట నకు రావడం లేదు. కేటీఆర్ స్థానంలో ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని లక్ష్మారెడ్డి పిలుపు మేరకు కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొన్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

