మహబూబ్‌నగర్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అచ్చంపేట : ‘మొలకెత్తిన వడ్లు కొనలేని చేతగాని దద్దమ్మ.. బీఆర్ఎస్ను ఉమ్మడి జిల్లాలో మొలకెత్తినీయడంట.. పాలమూరు జిల్లాలో ఎగిరేది గులాబీ జెండానే.. ప్రజలే బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడ్తారు.. ఇక్కడి 14 స్థానాల్లో 14 సీట్లు గెలుస్తాం.. నిన్ను కొడంగల్‌లో ఓడిస్తాం’.. అని బీఆర్ఎస్ డి ప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సవాల్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పార్టీ ఇన్చార్జి నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఈయన జెండా గద్దెలు కూలగొడుతాడట.. చేతులు కట్టుకొని కూర్చున్నామా? ‘ఈ ట్ కా జవాబ్ పత్తర్‌సే దేంగే’.. అని ఘాటుగా విమర్శించారు. మాటకు మాటతో.. చేతలకు చేతుల తో సమాధానం చెప్తాం… అని కార్యకర్తల సాక్షిగా చా లెంజ్ విసిరారు.
ఖాళీగా కూర్చుంటామా… ఉద్యమా లు చేసిన పార్టీ.. తెలంగాణ కోసం కోట్లాడిన పార్టీ.. 14ఏళ్లు జైళ్లలో దెబ్బలు తిని తెలంగాణ తెచ్చిన పార్టీ.. అని గుర్తు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా లో తెలంగాణ రాక ముందు 30 ఏళ్లుగా ప్రాజెక్టులకు కొబ్బరికాయలు కొట్టడం, శంకుస్థాపనలు చేయడం పనులు పెండింగ్‌లో పెట్టడం జరిగేది అన్నారు. తెలంగాణ వచ్చినంక పాలమూరు వలసలు నివారించేందుకు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. 2014కు ముందు ఈ జిల్లాలో కేవలం 27వేల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిదిన్నరేండ్ల్లలో ఆరున్నర లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
మేమంతా ఆనాడు మాజీ మంత్రులతో కలిసి ప్రాజెక్టుల వద్దనే బసచేసి పనులు పూర్తిచేసి కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కూడా స్వయంగా సమీక్షించి మూడున్నర లక్షలకు సాగునీరు అందించేలా తీర్చిదిద్దామన్నారు. కేసీఆర్ పాలమూరు వలసలను శాశ్వతంగా పారద్రోలాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే ఇదే కాంగ్రెస్ నేతలు కేసులు వేసి అడ్డుపడ్డ విషయం వాస్తవం కాదా? అని గుర్తు చేశారు. కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ కూడా ఎన్నో కష్టనష్టాలను ఓర్చి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పంప్ హౌస్‌లు నిర్మించినం.. మోటర్లు బిగించినం సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసి సొరంగాలను నిర్మించి రిజర్వాయర్లు చేపట్టామని, కేవలం కాల్వలు తవ్వితే నార్లాపూర్ ఏదుల, వట్టెం, కరివెన వరకు నీళ్లు వెళ్లేవన్నా రు. పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం అయి ఉండి ఈ జిల్లాకు న్యాయం చేయకపోగా ఆంధ్ర పాలకులు కృష్ణ నీటిని తరలించుకొని పోయేలా చూస్తున్నారని విమర్శించారు.
పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టుకు వచ్చి రెండు రోజులు ఉండి తిరిగి చూసి ఈ ప్రాజెక్టు మొత్తం స్వరూపం తెలుసుకోవడానికి రెండున్నరేండ్లు పట్టిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా భూసేకరణే జరగలేదని అబద్ధాలు మాట్లాడారని.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 27, 053 ఎకరాలు భూ సేకరణ పూర్తి చేశామని.. కేవలం 150ఎకరాలు మాత్రమే భూసేకరణే చేయా ల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లో చెప్పుకునేది ఏమో నల్లమల బిడ్డా అని.. చేసేవి నీచమైన పనులు.. అం టూ ఎద్దేవా చేశారు. కనబడిన దేవుళ్ల మీద ఒట్టు పెట్టాడు.. అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు.. నిజంగా నల్లమల బిడ్డ అయితే దేవుని మీద ఒట్టు వేసి మాట తప్పుతారా? అని ప్రశ్నించారు. వాగ్ధానాలు ఇచ్చి మాట తప్పినందుకు నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నాపై కేసు.. నోటీసులు ఇచ్చారని ఆయనన్నారు. ఇప్పుడు మోసగాడు అన్నాను.. నాకు తెలిసి అచ్చంపేటలో కేసు నమోదు అవుతుందేమో? అని అనుమానం వ్యక్తం చేశారు.
నాడు ఆర్థిక కష్టాలు అధిగమించి
ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం… ఇదే రేవంత్‌రెడ్డి ఏడాదిలో మూడుసార్లు రైతు బంధు ఇవ్వాలని .. తాను అధికారం చేపట్టి రెండున్నరేండ్ల్లలో మూడుసార్లు రైతు బంధు ఎగవేశాడని విమర్శించారు. రైతులకు రేవంత్‌రెడ్డి పడిన బకాయి రూ.29,300 కోట్లు అని..రైతు బంధు వేయడానికి కేసీఆర్ ఏనాడు మీటింగ్ పెట్టలేదు.. రేవంత్ రెడ్డి ఒక్కో ఎకరానికి రైతుబంధు ఇ స్తూ ఒక్కో మీటింగ్ పెడుతున్నాడు.. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పనిని నమ్ముకున్నాడు.. ప్రచారాన్ని కాదు అని చురక అం టించారు.
నల్లమల బిడ్డల గౌరవం, ప్రతిష్ట తగ్గిస్తున్నావ్.. అంటూ నిలదీశారు. ఎన్నికల ముందు అ న్ని పంటలకు బోనస్ అని మ్యానిఫెస్టోలో చెప్పా రు.. అధికారంలోకి రాగానే కేవలం సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటున్నారని అన్నారు. పంట మొ త్తం కొం టామని చెప్పి కేంద్రం ఎంత.. ఏ ధాన్యం కొంటుం దో.. మేము అదే.. అంతే కొంటామని రాష్ట్ర ప్రభు త్వం మాట తప్పిందన్నారు. గతంలో కేంద్రం ధా న్యం కొనకపోతే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసి మెడలు వంచి కొనిపించాడు.. అని గుర్తు చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. మాట్లాడితే డబ్బులు లేవని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. రూ.17కోట్లతో జూబ్లీహిల్స్ బిల్డింగ్‌కు కంచె కట్టుకున్నాడు.. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు దగ్గరలో రూ.100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కోసం ఖర్చు చేశాడని విమర్శించారు.

మనువడు, నువ్వు మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల రోడ్డు వేస్తున్నాడని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర్‌రెడ్డి ప్రా రంభించినా మంచి స్కీమ్ అని బీఆర్ఎస్ హయాం లో కొనసాగించామని గుర్తు చేశారు. రెండున్నరేండ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇచ్చింది గుం డు సున్నా అన్నారు. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెం ట్ రాక సగం కాలేజీలు మూతపడ్డాయి.. ప్రభుత్వం పై నిరుద్యోగులు, విద్యార్థులు విరుచుకు పడ్తున్నారన్నారు.
‘నేను తాడి చెట్టు లెక్క.. నువ్వు ఈత చెట్టు లె క్క’.. అని అంటున్నా డు.. దీనివల్ల ప్రజలకు ఏ ం లాభం? కేసులు, కు ట్ర లు ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని హరీశ్ ధ్వజమెత్తారు. ఒ క ముఖ్యమంత్రికి ఒక ఎమ్మెల్యే ఎత్తుతో ఏం అ వసరం.. పనిలో, మనసులో, గుణంలో పొడుగుండాలి.. అని రేవంత్‌కు చురక అంటించారు. మన ప్రభుత్వం రాగానే అన్ని కేసులు తీపిస్తాం.. ఎవరెవరు కేసులు పెట్టారో? వా రిపై తిరిగి కేసులు పెడదామని కార్యకర్తలకు భరో సానిచ్చారు. అక్రమ కేసులు బనాయించిన పోలీస్ అధికారులపై కూడా విచారణ చేయిస్తాం.. అక్రమ కేసులు పెట్టినోడిని మన ప్రభుత్వం వచ్చాక వదిలేది లేదని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెడతాం.. పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. కేసులు బనాయించిన ఆఫీసర్లను పట్టుకొచ్చి శిక్ష వేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ.. ఉమ్మడి పాలమూరు జిల్లా బాగు కోసం శ్రమించిన గులాబీ పార్టీని వదిలి వెళ్లిపోయిన నేత వెంబడి ఒక్క కార్యకర్త కూడా పోలేదని… ఈరోజు జరిగిన సమావేశమే నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒక మం చి లీడర్ పోతే ముప్పావు వంతు కార్యకర్తలు వెళ్తా రు.. యావరేజ్ లీడర్ వెళ్తే అర్ధభాగం మంది వెళతారు.. ఎంత పనికిరాని లీడర్ వెళ్లినా పావు వంతు కార్యకర్తలు వెళ్తారు.. కానీ అచ్చంపేటలో ఐదు శాతం మంది కూడా కార్యకర్తలు వెళ్లలేదంటే అర్థం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఉద్దేశించి అన్నారు. ఇవాళ కార్యకర్తల బలం చూస్తుంటే అచ్చంపేటలో ఎగిరేది గులాబీ జెండాని అని అర్థమవుతుందని హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జైపాల్ యాదవ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ 2028 నవంబర్ 30న కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఓటరు సవరణ(సర్) ప్రక్రియపై బీఎల్ఏలు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పశ్చిమబెంగాల్లో భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగిందని, అలాంటి పరిస్థితులు తెలంగాణలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి బూత్‌లో పార్టీ ప్రతినిధులు చురుగ్గా పనిచేస్తూ రైతులు, కార్మికులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పేదల ఓట్లు ఎక్కడ తొలగించబడకుండా చూడాలని సూచించారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8ల ప్రాముఖ్యత, బీఎల్ఏల బాధ్యతలపై కార్యకర్తలకు సవివరంగా అవగాహన కల్పించారు. ఈనెల 24 నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు బీఎల్వోలు ప్రతి ఇంటిని మూడుసార్లు సందర్శించి వివరాలను నమోదు చేస్తారని, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ బీఎల్వోలు ఇంటికి రాకపోతే ఈసీఐ నెట్ యాప్ ద్వారా సంబంధిత బీఎల్వో వివరాలు తెలుసుకొని సంప్రదించాలని సూచిం
చారు. ఓటరు నమోదు పూర్తయిన తర్వాత ఇచ్చే రెండు ప్రతుల్లో సంతకం చేసి బీఎల్వోలకు ఇవ్వాలని మరో ప్రతిని ఓటరు భద్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పోలీసుల వేధింపులకు, అధికార పార్టీ ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ధీమా వ్యక్తం చేశారు. సభకు తరలివచ్చిన కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే నమ్మకం కలుగుతుందన్నా రు. అనంతరం విజువలైజేషన్ ద్వారా కార్యకర్తలను పార్టీ విజయంపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వెం కటేశ్వర్‌రెడ్డి, జిల్లా సభ్యత్వ ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్, అచ్చంపేట సభ్యత్వ ఇన్చార్జి పాటిల్, అభిలాష్‌రావు, కరాటే రాజ్ స్థానిక నేతలు పోకల మనోహర్, నరసింహాగౌడ్, తులసీరాం, పర్వతాలు, అమీనోద్దీన్, మాకం తిరుపతయ్య, కేటీ తిరుపతయ్య, రవీందర్రావు, బండపల్లి వెంకటయ్య, శ్రీకాంత్ భీమా, సాంబ య్య, వంశీనాయక్, రమేశ్‌రావు, మన్ను పటేల్, శివ, విజేందర్‌గౌడ్, తదితర నా యకులు అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధు లు, బీఎల్ఏలు, బీఎల్వోలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.