వంగూరు, అక్టోబర్ 18 : తెలంగాణలో కాంగ్రెస్ టికెట్లను రేటెంతరెడ్డి(రేవంత్‌రెడ్డి)అమ్ముకుంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గు వ్వల బాలరాజు దుయ్యబట్టారు. మండలంలోని మిట్టసదగోడు, కోనాపూర్, రంగాపూర్, జాజాల గ్రామాల్లో బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన విప్ గువ్వలకు మహిళలు నుదుటికి తిలకం దిద్ది ఆటాపాటలతో స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ తెలంగాణాను సాధించి రాష్ర్టాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌ను మరోసారి సీఎంగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ర్టాన్ని దళారుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బా ధ్యత ప్రజలపైనే ఉందన్నారు. మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే వంటగ్యాస్ రూ.400 అందిచడం తో పాటు పేద మహిళలకు నెలకు రూ.3 వేలు అందిస్తామన్నారు. రై తులకు రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.16 వేలు అందించి వారిని ఆదుకునే బృహత్తర కార్యక్రమం చేపట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధం గా ఉన్నారన్నారు. అచ్చంపేట గడ్డ పై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడే విధంగా ప్రజలు కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు.
మండలంలోని రంగాపూర్‌లో సీపీ ఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మేకల కృష్ణయ్యతోపాటు 100 మంది గువ్వల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు కృష్ణారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సం ధ్యానర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షు డు గణేశ్‌రావు, నరేందర్‌రావు, మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు లాలుయాదవ్, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్‌తోపాటు సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు అంజి తదితరులు పాల్గొన్నారు.