మహబూబ్‌నగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో విడుత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నచిన్న వాగ్వాదాలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి ఓటర్లు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం శేరివేంకటాపూర్లో బీఆర్ఎస్ నారాయణపేట జి ల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కు టుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కడ్తాల్ మండలం చల్లంపల్లిలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణపేట జిల్లా సింగారంలో జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఓటేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆరు మండలాల్లో జరిగిన పో లింగ్లో మొత్తం 86.62 శా తం నమోదైంది. మొత్తం
6 మండలాల్లో 1,85,040 ఓటర్లకు గానూ ఒక లక్షా 60, 284 ఓట్లు పోలయ్యాయి. గద్వాల జిల్లాలో నా లుగు మండలాల్లో 1,12, 807 ఓట్ల గానూ 98, 234 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 87.08 శాతం ఓటింగ్ నమోదైంది. నారాయణపేట జి ల్లాలోని నాలుగు మం డలాల్లో మొత్తం 84.33 శాతం ఓటింగ్ నమోదయింది. 1,50, 318 ఓటర్లకు గా నూ 1,26 769 మంది త ము ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏడు మండలాల్లో 84 శాతం ఓటింగ్ నమోదు అయింది. మొత్తం 2,50,239 ఓటర్లకుగానూ రెండు లక్షల పదివేల 151మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల్లో మొత్తం కలిపి మొత్తం ఓట్లు 1,18,792 గానూ 1,03,406 ఓట్లు పోల్ కా గా.. 87.05 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో విడుత ఎన్నికలు కూడా ప్రశాంతంగా చేయడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తీరును ఆయా జిల్లా కలెక్టర్లు కలెక్టరేట్లోని సమావేశం మందిరం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.
ఆయా జిల్లాలకు కేటాయించిన సాధారణ ఎన్నికల పరిశీలకులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరు గుచున్న ప్రక్రియను పరిశీలించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జ రుగకుండా పోలీసులు కట్టుదిట్టం చేశా రు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి క్యూ లైన్లో ఉన్న వారం దరికీ ఓటు వేసే అవకా శం కల్పించా రు. ఆయా జి ల్లాల ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏ ర్పాటు చేశారు. హ న్వాడ మండల కేం ద్రంలో పోలింగ్ కేంద్రాలను జోగుళాంబ గద్వా ల జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ పరిశీలించారు.
రెండో విడుత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసేందుకు పలువురు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మర్రి వెంకట్‌రెడ్డి కూతు రు నిషితారెడ్డి లండన్ నుంచి వచ్చి నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో ఫోరెన్సిక్ సైన్స్ చదువుతున్న తిమ్మాజిపేటకు చెందిన బెనహర్ మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నాడు.