మద్దూరు, మే 3 : దొడ్డు వడ్లు కొనమంటూ రైతులను రోడ్డున పడేస్తారా.. రైతు ఆరుగాలం కష్టపడి పం డించిన పంటను పొలం గట్టు నుంచి తెచ్చినా కనిక రం చూపకుండా సన్నాలు కావు, ఇవి దొడ్డు వడ్లు అసలే కొనమని రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. తమ కష్టాన్ని ధా న్యం రూపంలో తెచ్చి తర్వాత రైస్‌మిల్లుల ఎదుట పడిగాపులు పడుతున్న రైతును ఆదుకునేవాడు లేడు.. కాంటా పెట్టెదెప్పుడు.. ఇంటికేళ్లేదెప్పుడు, క్యూ లో నిలపడ్డప్పుడు వర్షం పడితే మా ధాన్యం గతి ఏమిటని రైతులు అందోళన చెందుతున్న ఘటన నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో చోటు చే సుకున్నది.
ధాన్యాన్ని రైస్ మిల్లు యజమానులు దింపుకోవడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మద్దూర్ మండల కేం ద్రం నుంచి పెదిరిపాహాడ్ రో డ్డులో ఉన్న పద్మావతి రైస్ మిల్లు వద్ద రైతులు 60 ట్రాక్టర్లకు పైగా క్యూలైన్లో నిలబడ్డా పట్టించుకునే నాథుడే లే డని శనివారం రైతులు ఆం దోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్‌కుమార్, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని రైస్‌మిల్లు యాజమానితో మాట్లాడి రైతులకు 20 వాహనాలు టోకెన్లు ఇచ్చి దింపుతామని మాటా ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు.
కానీ మిగితా 40 వాహనాల రైతులు మేము ఇంటి కేళ్లేదేప్పుడు మేము తెచ్చిన వాహనాల కిరాయిలు ఎంత అవుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సివిల్ సప్లయ్ డీటీ ఆనంద్ కుమార్‌ను వివరణ కోరగా, 20వాహనాలకు టోకెన్లు ఇచ్చాం, ఇంకో 5వాహనాలకు అనుమతి తీసుకున్నాం. అలాగే అదివారం 25 వాహనాలకు పరిమిషన్ తీసుకుంటా, ఇప్పటికే లక్ష్మీవెంకటేశ్వర రైస్ మిల్లులో కూడా 14టోకెన్లు ఇచ్చాం. మిగిలిన వాహనాలు కూడా ఏదో ఒక రైస్ మిల్లులో టోకెన్లు ఇప్పిస్తామని తెలిపారు.