మహబూబ్‌నగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయాలుగా మారాయి. ధాన్యం కొనుగోలు చే యడమే కాకుండా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని సర్కారు ప్రకటించినా కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. ప్ర భుత్వ నిబంధన వల్ల ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదని తెలుస్తోంది. రైతులు ఇక చేసేది లేక దళారులకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే రైతుల కల్లాల వద్దకు వెళ్లి తూకం చేసి వడ్లను కొని లారీల్లో మిల్లర్లకు పంపించేది.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులే కొ నుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని షరతు విధించింది. అంతేకాకుండా ఒక్క గన్నీ బ్యాగ్ కూడా ఇప్ప టివరకు సరఫరా చేయలేదు. పైగా ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తీసుకొస్తేనే కొంటామని మెలిక పెట్టింది. ఫలితంగా రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ధాన్యా న్ని ఆరబెట్టడం, సొంత బ్యాగులను నింపడం, తర్వాత కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవడం ఖర్చుతో కూడుకున్న పనిగా భావిస్తున్నారు. తేమశాతం, ఇతర నిబంధన ల వల్ల రైతులు హడలిపోతున్నారు. దీంతో అమ్మకాలు లేక కొనుగోలు కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టి అమ్ముకుందామంటే కొనే పరిస్థితి లేదు. మరోవైపు సర్కార్ సన్నవడ్లకు మద్దతు ధరతోపాటు రూ.500ల బో నస్ ఇస్తామని ప్రకటించింది. ఈ బోనస్‌పై ఇంతవరకు విధివిధానాలు లేకపోవడంతో ఏం చేయాలో తోచక అధికారులు రైతులకు ఏం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సర్కారు చెప్పేదానికి వాస్తవ పరిస్థితి పూర్తి గా భిన్నంగా ఉంది. మరోవైపు రైస్ మిల్లర్లు సర్కారు మద్ద తు ధర కన్నా రూ.80 క్వింటాకు అధికంగా ఇచ్చి నేరుగా కొంటున్నారు. దీంతో చాలామంది రైతులు గత్యంతరం లేక ప్రైవేట్‌కు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు ఒక్క గింజ కూ డా కొనలేదు. మంత్రి, ఎమ్మెల్యేలు ఫొటోలకు ఫోజులిస్తూ ఆగమేఘాలపై కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మ ద్దతు ధరతోపాటు సన్న వడ్లకు బోనస్ కూడా ఇస్తామని పదేపదే చెబుతున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నిబంధనల వల్ల చాలా మంది రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడానికి ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా రవాణా చార్జీలు, గన్నీ బ్యాగుల ఖ ర్చు అదనంగా భరించాల్సి వస్తున్నది. గతంలో నేరుగా కల్లాల వద్దకే లారీలు వచ్చి కొనుగోలు చేస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోలు చేయకపోవడం వెనక మతలబు ఏ మిటని రైతాంగం ప్రశ్నిస్తున్నది. అదే రైస్ మిల్లర్లు మాత్రం ధాన్యాన్ని సర్కారు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.100 వరకు ఎక్కువ ఇచ్చి కొంటున్నారు. దీంతో స ర్కారు మిల్లర్లతో మిలాఖత్ అయ్యి కొనుగోళ్లను నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. తేమశాతాన్ని మిల్లర్లు అంత గా పట్టించుకోకపోవడంతో ఉమ్మడి జిల్లాలో చాలామంది నేరుగా వ్యవసాయ మార్కెట్లకు చేరుకొని కమిషన్ ఏజెంట్లకు క్వింటాకు రూ.2010 చొప్పున అమ్ముకుంటున్నారు.
ధాన్యానికి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి తర్వాత రెండు సార్లు ధాన్యం కొనుగోలు చేసినా పట్టించుకోలేదు. ఈసారి వానకాలంలో వరికి మద్దతు ధరతోపాటు బోనస్ రూ.500 ఇస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే లు అట్టహాసంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. రైతులే నేరుగా కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి ఆరబెట్టి 17శాతంలోపు తేమ ఉంటేనే మద్దతు ధర లభిస్తుందని చెబుతున్నారు. వరి కోతలయ్యాక కల్లాల నుంచి నేరుగా కొనుగోలు కేంద్రాలకు రవాణా, గన్నీ బ్యాగులు కొని సర్కారుకు అమ్ముకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో గత్యంతరం లేక దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. మొత్తం 60 కొనుగో లు కేంద్రాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో 39, పీఏసీసీఎస్ 21 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సన్న రకం వరి సాగు 34,592 హెక్టార్లు, దొడ్డు రకం 1,129 హెక్టార్లలో సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా రు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 252 కొనుగోలు కేంద్రా ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటివరకు 116 కేంద్రాలు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కొ నుగోలు ప్రారంభం కాలేదు. వనపర్తి జిల్లాలో 377 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా ఉంది. నారాయణపేట జిల్లాలో 97 కేంద్రాలను ఏర్పాటు చేసినా కొనుగోలు ప్రారంభం కాలేదు.. మహబూబ్‌నగర్ జిల్లాలో 34 కేంద్రాలు ప్రారంభించగా, ఒక్క కేంద్రంలో కూడా ధాన్యం కొనుగోలు చేపట్టలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీయే సక్కగా చేయలేదు. రెండు విడుతలుగా రైతుభరోసా లేదు. ఇక వీళ్లు మద్దతు ధర ఇచ్చి బోనస్ ఇస్తారంటే నమ్మకమెట్లా వస్తది. అందువల్లే చాలామంది ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నరు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్లడానికి రవాణా ఖర్చులు, గన్నీ బాగులు కొనాలంటే బోలెడంత ఖర్చవుతుంది.
– రాములుగౌడ్, రైతు, పాతపల్లి, ధన్వాడ మండలం, నారాయణపేట జిల్లా
రెండ్రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ను ప్రారంభిస్తాం. పూర్తి స్థాయిలో సెంటర్లకు సామగ్రి అందలేదు. ఇటీవలే డీఎంగా బాధ్యతలు తీసుకున్నా. త్వరలోనే తూకాల జరిపిస్తాం. ఇం దుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎలాంటి ఇబ్బందుల్లేవు. కొత్త విధానం అమల్లోకి వచ్చినందున ఆలస్యమవుతున్నది.
– రమేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం, వనపర్తి
సర్కారు వడ్లు కొంటుందని 20 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. 8 ఎకరాల్లో వరి సాగుచేసినం. నా లుగున్నర ఎకరాలు కోసి ఆరబెట్టి నం. సర్కారోళ్లు కొంటామని చెప్పడమే తప్పా కొనింది లేదు. మిగిలి న చేను కూడా కోయాల్సి ఉన్నది. ఇన్ని రోజులుగా కొనకుండా రైతులను ఇబ్బందులు పెడితే ఎట్లా. వానొస్తే మాకు ఎంత కష్టం, నష్టం వస్తుంది.
– మహేశ్వరి, రైతు, రామన్‌పాడ్, మదనాపురం మండలం
పది రోజుల నుంచి తుకాలు చేస్తామని చెబుతున్నరు. మాకున్న 11 ఎకరాలు నాటుకోగా, 7 ఎకరాలు కోసి అమ్మకానికి సిద్ధంగా ఉంచినం. సర్కారు అప్పుడు, ఇ ప్పుడు అనడమే కానీ తూకం చే యడం లేదు. పదేండ్లు దనాధన్.. ఫటాఫట్ అనేలా ఇబ్బంది లేకుం డా అమ్ముకున్నాం. ఇప్పుడేమో కొనడానికే డీలా చేస్తున్నరు. చాలా మంది ప్రైవేటోళ్లకు అమ్ముకొని నష్టపోయిండ్రు.
– శంకరమ్మ, రామన్‌పాడ్