మక్తల్, నవంబర్ 26 : మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో ఫుడ్ పాయిజన్పై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. ఆ సిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో శైలజ మృతి చెంది 24 గంటలు గడవక ముందే మాగనూరు జెడ్పీహెచ్ఎస్ లో వారంలో రెండోసారి మధ్యాహ్న భోజ నం తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కా వడం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందన్నారు.
మక్తల్ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను చిట్టెం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ఫుడ్ పాయిజన్ వల్ల ఎం తోమంది విద్యార్థులు దవాఖాన పాలై ప్రా ణాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆరోపించారు. రేవంత్రెడ్డి పాలనలో గురుకుల పాఠశాలలు మృత్యుగోసలుగా మారాయన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలను చూస్తుంటే ప్ర భుత్వ యంత్రాంగం నిద్రపోతుందా లేదా? విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుం దా అర్థం కావడం లేదన్నారు.
విద్యార్థులకు భోజనం వండి పెడితే బయటి వ్యక్తులు ఎందుకు వస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు.. కానీ ఫుడ్ పాయిజన్ ఎందుకు అయ్యింది, ఎలా నియంత్రించాలని ఆలోచించడం లేదన్నారు. ఫుడ్ పా యిజన్ విషయాన్ని తెలుసుకుందామని ఫో న్ చేస్తే కలెక్టర్ మీటింగ్లో ఉన్నారంటూ బదులిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం రేవంత్రెడ్డి స్పందించి విద్యార్థులకు పాఠశాలలు, గురుకులాల్లో నాణ్యతో కూడిన భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని లేదంటే మహబూబ్నగర్లో నిర్వహించే సీఎం మీటింగ్కు వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో తరలివెళ్లి నిలదీస్తామని హెచ్చరించారు. ఆయన వెం ట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.