మహబూబ్నగర్, అక్టోబర్ 28 : దళితులు ఎవరైనా చనిపోతే వారిని పూడ్చడానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు స్వార్థపరులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకెవరు లేరు అడ్డం.. అన్నట్లు వారి వ్యవహారం తయారైందని పాతపాలమూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కలెక్టర్, మరో వైపు ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులు ఉన్నా జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమకు కేటాయించిన భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని పలువురు ‘నమస్తే తెలంగాణ’తో వాపోయారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి శివారులోని సర్వేనెంబర్ 439 లో ఉన్న నాలుగు ఎకరాల 20గుంటల ప్రభుత్వ భూమి ని చాలా ఏండ్ల నుంచి శ్మశాన వాటికకు వినియోగిస్తున్నా రు. అయితే పాతపాలమూరుకు చెందిన నలుగురు వ్యక్తు లు ఈ భూమిలో హిటాచీతో చెట్లను తొలగించడమే కా కుండా కంప్రెషనర్తో బండరాళ్లను పగలగొడుతూ భూ మిని చదునుచేస్తున్నారని, ప్రశ్నిస్తే ఎవరికి చెబుతారో చె ప్పుకోండని బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోయారు. ఈ విషయమై పలుమార్లు ప్రజావాణిలో, మహబూబ్నగర్ అర్బన్ తాసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. కాగా, ఈ భూమి సమీ పం నుంచే బైపాస్ రోడ్డు వస్తుండడంతో భూముల విలువ పెరగడంతో కబ్జాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సర్వేనెంబర్ 439 ప్రభుత్వ భూ మిని కబ్జా కాకుండా కాపాడాలి. ఈ విషయమై తాసీల్దార్కు పలుమార్లు ఫిర్యాదు చేశాం. అన్యాయంగా ప్రభుత్వభూమిని బాలకృష్ణ, రామకృష్ణ, గోవర్ధన్, ధనుంజయ్ అనే వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.
– నర్సిములు, పాతపాలమూరు వాసి
దళితుల శ్మశానవాటికకు చెందిన భూమిని కొందరు కబ్జా చేస్తున్నారు. కబ్జా విషయం అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారుల కు ఫిర్యాదు చేయగా, వచ్చి చూసి వెళ్లడమే కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు స్పందించి శ్మశానవాటిక భూమి ని కాపాడాలి.
– యాదయ్య, పాతపాలమూరు వాసి
సర్వేనెంబర్ 429లో ప్రభుత్వ భూమి ఉన్నది. భూమి ని కబ్జా చేశారని కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్వే చేయించాం. రికార్డులు పరిశీలించి ప్రభుత్వ భూమి అయితే ఏ స్థాయిలో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటాం.
– ఘాన్సీరాం, మహబూబ్నగర్ అర్బన్ తాసీల్దార్