గద్వాల, ఏప్రిల్ 10 : వరికి మద్దతు ధర కల్పించాలన్న లక్ష్యంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడినా.. ఊరట లభించింది. ఈ ఏడాది యాసంగికి సంబంధించి ధాన్యంతోపాటు మొక్కజొన్న పంటను రైతులు కోసి ఆరబెట్టారు. అయితే సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం వహించింది.
దీంతో రైతులు ఇప్పటికే మక్క పంటను దళారులకు తక్కువ ధరకే విక్రయించినట్లు తెలిసింది. ప్రస్తుతం మిగిలిన మొక్కను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే యాసంగి వరి కోతలు పూర్తవగా.. ధాన్యం కల్లాల్లో ఆరబెట్టారు. ఈ తరుణంలో కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించి కొనుగోళ్లు వేగంగా జరిగేలా చూడాలని రైతులు కోరారు.
యాసంగి ధాన్యం కొనుగోలుకు జోగుళాంబ గద్వాల జిల్లాలో 87 సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ సీజన్లో 74,162 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 2.34 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. అందులో 2 లక్షల టన్ను లు సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా నిర్ణయించుకున్నది. గతేడాది ధాన్యం సేకరణకు ప్రభుత్వం 69 కేంద్రా లు ఏర్పాటు చేయగా.. ఈసారి 18 సెంట ర్లు అధికంగా ఏర్పాటు చేస్తున్నారు.
దొడ్డు రకం ధాన్యం సేకరణకు నాలుగు, సన్నరకానికి 83 కేంద్రాలు ఏర్పాటు కానున్నా యి. ఇందుకు సంబంధించి గోనె సంచు లు, వాహనాలు, కూలీలను సమకూర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సీజన్లో మద్దతు ధర ఏ-గ్రేడ్ క్వింటాకు రూ. 2,369తోపాటు రూ.500 బోనస్ లభించనున్నది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 69, పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో 12, మోప్మా ఆధ్వర్యంలో 5, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఒక సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో మక్క కొనుగోలుకు శాంతినగర్, అయిజ, గద్వాలలో అధికారులు కేం ద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రా రంభం కానున్నాయి. జిల్లాలో 80,634 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. 10 లక్షల బ్యా గుల వస్తాయని అధికారులు అంచనా వేశారు. మద్దతు ధర రూ.2,400గా నిర్ణయించగా.. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు.
కేంద్రాలకు మక్క తీసుకొచ్చే రైతులు తప్పని సరిగా ఏఈవో ధ్రువీకరణ ప త్రం, పట్టాదార్ పాస్బుక్, ఆధార్, బ్యాం క్ ఖాతా బుక్ (రైతుబంధుకు లింక్ చేసినది) జిరాక్స్లు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే జిల్లాలో పప్పుశనగ పంటను రైతులు 9,913 ఎకరాల్లో సాగు చేశారు. కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఎర్రవల్లి మండలం వల్లూరులో కేంద్రాన్ని ఏర్పా టు చేయనున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటుతో రైతులు దళారులకు అమ్మకుండా సెంటర్లలోనే విక్రయించి మద్ధతు ధర పొందే అవకాశం ఉన్నది.