మక్తల్, జూలై 18 : 70 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, ఇప్పుడు అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ర్టాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నదని, ఇప్పటి వరకు సాగునీరు విడుదల చేయకుండా ఎరువులు, విత్తనాలు అందించకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని దుయ్యబట్టారు. శుక్రవారం రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ మక్తల్‌లోని 167 జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం ఆధ్వర్యంలో రైతులు, ఆ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పంటలు సాగు చేసే సమయంలో ఎరువు లు, విత్తనాల కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండేదన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బాధ్యతలు చేపట్టిన అనంతరం రైతులను అన్ని విధాలా ఆదుకున్నారని వివరించారు.
ముఖ్యంగా లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు 24 గంటల కరెంట్ సరఫరా, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలను పెట్టి ఆదుకోవడమే కాకుండా రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేయడంతో పదేండ్లు వ్యవసాయం అంటే పండుగలా సాగిందని గుర్తు చేశారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న అనేక సమస్యను మళ్లీ ప్రారంభమైన పరిస్థితి దాపురించిందని వాపోయారు. ముఖ్యంగా విద్యుత్ సక్రమంగా అందించక పోవడంతో రైతుల పంటలు ఎండిపోయాయని, ప్రస్తుత వానకాలం పంటల సాగుకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు మళ్లీ రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై రెండో వారం పూర్తైనా ఇప్పటి వరకు నియోజకవర్గంలోని రిజర్వాయర్లకు నీరు రాలేదని, కాల్వల ద్వారా నీరు చెరువులకు నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు ఆయకట్టు పరిధిలో సాగుచేసేందుకు వెనుకాముందు అవుతున్న పరిస్థితి నెలకొందన్నారు.
మక్తల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి సకాలంలో స్పందించి ఉంటే ఇప్పటికే నియోజకవర్గంలోని రిజర్వాయర్లు నిండి కాల్వల ద్వారా నీరు విడుదల చేసి ఉంటే రైతులు పంటలు సాగు ప్రారంభించే వారన్నారు. ముఖ్యంగా వ్యవసాయంపై అవగాహన లేని నాయకులు అధికారంలోకి రావడం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గమైన కోడంగల్‌కు నీటిని తీసుకువెళ్లాలనే లక్ష్యంతో కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతలను తీసుకొచ్చి మక్తల్ నియోజకవర్గ రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. మక్తల్ పరిధిలోని భూత్పూర్ రిజర్వాయర్‌లో ఒకటిన్నర టీఎంసీ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు నుంచి కొడంగల్‌కు ఏడు టీఎంసీలు ఏవిధంగా తరలిస్తారో రేవంత్‌రెడ్డి చెప్పాలన్నారు. మక్తల్ నియోజకవర్గ ప్రజలు, రైతులకు అన్యా యం జరిగితే మాత్రం సహించమని వారి కోసం ఎక్కడికైనా వస్తాం, ఎవరితోనైనా కొ ట్లాడుతామని అన్నారు.
ప్రస్తుతం నియోజకవర్గంలో అక్కడక్కడ పంటలు సాగు చేసుకున్న వారికి కూడా ఎరువులు అం దించలేదని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభు త్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి రైతులకు సరిపడా ఎరువులను అందుబాటు లో ఉంచాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఊటూర్ మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, నర్వ, మాగనూర్ మండల పార్టీ అ ధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, నాయకులు ఆశిరెడ్డి, శివరాజ్ పాటి ల్, సుధాకర్‌రెడ్డి, అన్వర్‌హుస్సేన్, మారుతిగౌడ్, గాల్‌రెడ్డి, దం డు అయ్యన్న, శ్రీనివాస్‌రెడ్డి, జుట్ల శం కర్, మన్నాన్, అమ్రేష్, గంగాధరచారి, నరేందర్‌రెడ్డి తది తరులు ఉన్నారు.