జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. మల్దకల్ మండలంలోని విఠలాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుమలేశు, గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులను సస్పెండ్చేస్తూ జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఉత్తర్వులు ఇచ్చారు. ఫేక్ డీఎస్ఆర్ అటెండ్స్ చేసిన నేపథ్యంలో ఇద్దరు సెక్రటరీలపై చర్యలు తీసుకున్నారు.
జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు అందరూ ప్రతిరోజు ఉదయం 11 గంటల లోపు తప్పనిసరిగా లైవ్ డీఎస్ఆర్ ఫేస్ రికగ్నైజేషన్ను యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. లైవ్ డీఎస్ఆర్ నమోదు చేయకపోతే లేదా ఫేక్ డీఎస్ఆర్ నమోదు చేసినచో కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు పూర్తి బాధ్యతతో, సమయానికి తమ విధులను నిర్వహించగలరని సూచించారు.