మల్దకల్, అక్టోబర్ 8 : పిచ్చికుక్కల దాడిలో పలువురికి గాయాలైన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. మల్దకల్ మండలం నాగర్‌దొడ్డిలో బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రెండు పిచ్చి కుక్కలు స్థానికులపై దాడి చేశాయి.
ఎస్సీ కాలనీ వరకు రెండు కుక్కలు స్వైరవిహారం చేయడంతో తిమ్మప్ప, అమీర్ కూతరు యాస్మిన్, శాన్వి, ప్రమోద్‌తో పాటు మరో నలుగురిని కరిచాయి. వీరందరూ గద్వాల ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 500 కుక్కలు ఉన్నాయని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.