రాజాపూర్, ఏప్రిల్ 15 : రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంద ని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీతంగా పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. శుక్రవారం రాజాపూర్కు చెందిన 14 మంది, రంగారెడ్డిగూడకు చెందిన ఐదుగురు, ఈద్గాన్పల్లికి చెందిన నలుగురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు హైదరాబాద్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం దేశంలోనే ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు.
పేదలకు ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసానిచ్చారు. మంచి చేసే ప్రభుత్వానికి ప్రజ లు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశై లం యాదవ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, యూత్ వింగ్ అధ్యక్షు డు వెంకటేశ్, శ్రీనివాస్, దేవేందర్, రామకృష్ణాగౌడ్, యాదగిరి, విజయ్ పాల్గొన్నారు.