Municipal Elections | మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికైన అభ్యర్థికి వెంటనే ఎలక్షన్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అధికారికంగా ధృవీకరణ చేయాలని సూచించింది.
ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థికి ఎలక్షన్ సర్టిఫికెట్ ఫామ్ 27 అందించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఎన్నికైన అభ్యర్థిని అధికారికంగా గుర్తింపు పొందినట్లు ధృవీకరణ చేయాలని పేర్కొంది.రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలోనే సర్టిఫికెట్ అందజేయాలని సూచించింది. సర్టిఫికెట్ అందుకున్నట్లుగా అభ్యర్థి సంతకం చేయించుకోవాలని కూడా తెలిపింది.