గువాహటి: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి మ్యాచ్ గెలుచుకున్న భారత జట్టు.. బుధవారం గువాహటిలో రెండో వన్డే ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న శుభ్‌మన్ గిల్ సేన.. బర్సపర స్టేడియంలోనే సిరీస్‌ను పట్టేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది.
భారీ స్కోర్లు నమోదయ్యే బర్సపరలో తొలి వన్డేలో మాదిరిగానే కోహ్లీ, గిల్, రోహిత్ చెలరేగాలని టీమిండియా ఆశిస్తున్నది. 2018లో ఇక్కడ వెస్టిండీస్‌తోనే జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి నిర్దేశించిన 322 పరుగుల ఛేదనలో భాగంగా రోహిత్, కోహ్లీ శతకాలతో భారీ విజయాన్ని అందుకుంది. మరి నేటి మ్యాచ్‌లో ‘రోకో’ ఎలా చెలరేగుతారో చూడాలి.