దేశం గర్వించే గొప్ప నటుడు ఫహాద్
ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించారు. మంగళవారం హైదరాబాద్‌లో అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించారు. మంగళవారం హైదరాబాద్‌లో అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘చేతికి సర్జరీ అయిన దగ్గరి నుంచి జోష్ రావడం లేదు. కానీ మీ అందరిని చూసిన తర్వాత ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు చేయి బాగా కోలుకుంది. త్వరలో ‘డ్రాగన్’ షూటింగ్ మొదలుపెట్టబోతున్నాం. ఎలాంటి ఆలస్యం లేకుండా ముందస్తుగా ప్రకటించిన తేదీకే సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. నేను చూసిన ఫహాద్ ఫాజిల్ తొలి చిత్రం ‘బెంగళూరు డేస్’. అప్పటి నుంచి ఆయన సినిమాల్ని ఇష్టపడటం మొదలుపెట్టాను. ఆయన నటన చూసి స్ఫూర్తిపొందాను. ఫహాద్ దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు. ఆయన తొలిసారి లీడ్ యాక్టర్‌గా తెలుగులో చేస్తున్న ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని, కెరీర్లో మరపురాని చిత్రంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నా.
అలాగే నా తమ్ముడు కార్తికేయ నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రానికి మీ అందరి ఆశీస్సులు కావాలి’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ ‘ఫహాద్ ఫాజిల్ సినిమాలు చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ‘ట్రాన్స్’ సినిమా నన్ను నిజంగా ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. తెలుగు ప్రజలకు ఆయన బాగా చేరువయ్యాడు. దర్శకుడు శశాంక్ ఏలేటి నాలుగేళ్ల క్రితం వచ్చి ‘ఓ దెయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ ఇది’ అని చెప్పాడు. నాకు బాగా నచ్చింది. రెండు నెలల క్రితం ఫస్ట్‌కాపీ చూశా. చాలా సేపు నవ్వుకున్నా. హార్ట్‌టచింగ్‌గా కూడా అనిపించింది. ఇది చిన్న పిల్లల సినిమా అనుకుంటారు కానీ.. ప్రతీ పెద్దోడిలో ఉన్న చిన్న పిల్లల సినిమా’ అన్నారు. ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ.. హైదరాబాద్ తనకెంతో ప్రత్యేకమని, ఇక్కడ ఎంతో మంది స్నేహితుల్ని సంపాదించుకున్నానని, ఈ నగరంతో ప్రేమలో పడ్డానని చెప్పారు. ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం కొత్తగా ఉంటుందని నిర్మాత కార్తికేయ అన్నారు. వినోదంతో పాటు ఎమోషన్స్ ఉన్న సినిమా ఇదని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

