Suryapet | మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి బయటపడింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకుండా రేవంత్ సర్కార్ చేస్తున్న జాప్యంపై నిరసన తెలుపుతూ బ్యాలెట్ బాక్స్‌లో ఓ లెటర్ ప్రత్యక్షమైంది. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఎక్కడా అంటూ అందులో పెన్షనర్లు ప్రశ్నించారు.
సూర్యాపేట మున్సిపాలిటీలోని 47వ వార్డులోని బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లను లెక్కిస్తుండగా ఈ లెటర్ బయటపడింది. అందులో.. ” ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా! మేం రిటైర్మెంట్ అయ్యి 15 నెలలు గడిచింది. మాకు రావాల్సిన, మీరు చెల్లించాల్సిన డబ్బులు ఏ ఒక్క పైసా కూడా రాలేదు. ఇవ్వలేదు. అనేక ఇబ్బందులు పడుతూ, అనారోగ్యం పాలవుతున్నాం. ఆస్పత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటివరకు 62 మంది చనిపోయారు. అందుకే బాధతో మేం చనిపోక ముందే మా డబ్బులు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం” అని ఆ లేఖలో ఉంది. ఈ లెటర్ ఇప్పుడు వైరల్‌గా మారింది,