అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలోని మొత్తం 20 వార్డులకుగానూ బీఆర్ఎస్ పార్టీ 13 వార్డుల్లో గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వార్డులలో 1, 2, 4, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 17, 18 వార్డులు ఉన్నాయి. మిగిలిన 7 వార్డులలో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచిన వార్డులలో 3, 5, 10, 15, 16, 19, 20 వార్డులు ఉన్నాయి.
ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని గడ్డిపోతారం మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలోని మొత్తం 18 వార్డులకుగానూ బీఆర్ఎస్ 14 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం మూడు వార్డులకే పరిమితమైంది. మరో వార్డులో ఇండిపెండెట్ అభ్యర్థి గెలిచారు.