మహ్మదాబాద్, ఏప్రిల్ 27 : గంజాయి సాగుపై సర్కా ర్ సీరియస్‌గా ఉందని, సాగుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కథనం మేరకు.. మండలంలోని అన్నారెడ్డిపల్లి తండాలో గంజాయి సాగు చేస్తున్నారనే స మాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. సర్వేనంబర్ 21/ఈలో కంచన్‌పల్లి గ్రామానికి చెందిన గుత్తా చం ద్రయ్య ఒక గంజాయి మొక్కను సాగుచేస్తున్నట్లు గుర్తించారు.
అలాగే పొలం వద్ద గుడిసెలో 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చంద్రయ్యను అదుపులోకి తీసుకొని పరిగి న్యాయస్థానంలో హాజరుపరిచా రు. న్యాయమూర్తి నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మత్తు పదార్థాల బానిస పడిన వారు కుటుంబ సభ్యులతో కలిసి తమను సంప్రదిస్తే రీ హాబిటేషన్ సెంటర్లో చేరుస్తామని బాలకృష్ణ తెలిపారు. గంజాయి సాగు చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామ ని హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, శ్వే త కుమారి, వెన్నెల, సిబ్బంది దయాకర్, కృష్ణ, రాంరెడ్డి, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.