Gadwala municipality | రెండు వర్గాలు.. అయోమయంలో గద్వాల కాంగ్రెస్ భీ ఫామ్ల పరిస్థితి..!
Gadwala municipality | నేడు ఉదయం ఎమ్మెల్యే బండ్ల వర్గానికి 37 వార్డులకుగాను 37 వార్డుల అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీ ఫాంలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన అభ్యర్థులంతా అధికారులకు భీ ఫామ్లను సమర్పించారు.
Gadwala municipality | మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. జోగులాంబ గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రావడంతో.. 37 వార్డులకుగాను 7 సీట్లను సరిత తిరుపతయ్య వర్గం, 30 సీట్లు ఎమ్మెల్యే బండ్ల వర్గానికి కేటాయించారు. అయితే ముందుగానే నేడు ఉదయం ఎమ్మెల్యే బండ్ల వర్గానికి మొత్తం 37 వార్డులకుగాను అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీ ఫాంలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన అభ్యర్థులంతా అధికారులకు భీ ఫామ్లను సమర్పించారు.
ఇదిలా ఉంటే మరోవైపు సరితా తిరుపతయ్య వర్గం తమకు అధిష్టానం 7 వార్డులను కేటాయించిందంటూ బీ ఫామ్లతో దర్శనమిచ్చారు. కాగా ఆ 7 వార్డులకు ఇప్పటికే ఎమ్మెల్యే బండ్ల వర్గానికి చెందిన అభ్యర్థులు బీ ఫామ్లు సమర్పించారు. ఇలా ఒకేసారి 7 వార్డులకు రెండు వర్గాలకు కాంగ్రెస్ బీ ఫామ్లు ఇవ్వడం పట్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల్లో ఇంతకీ ఎవరి బీ ఫామ్లు చెల్లుతాయనేది తెలియాల్సి ఉంది.


Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

