గద్వాల: జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. జూరాల కాల్వకు నీటిని విడుదల చేయడంతో రైతులు పొలం పనులు ప్రారంభించి తమ పొలాల్లో నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) వద్ద వరుసలో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవైపు ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులందరికీ యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.