10th Class Students | వడ్డేపల్లి : మండలంలోని తనగల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుర్వ గడ్డం తిమ్మప్ప ఎగ్జామ్ ప్యాడ్లను(స్టేషనరీ) అందజేశారు. ఈ సందర్బంగా గడ్డం తిమ్మప్ప మాట్లాడుతూ.. విద్యార్థి దశలో పదవ తరగతి తొలిమెట్టు అని, విద్యార్థులు అందరూ శ్రద్ధతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజంలోని అన్ని విషయాలను గమనిస్తూ ముందుకెళ్లినప్పుడే సమాజంలోని కొత్త విషయాలను తెలుసుకుంటారని తెలిపారు.
బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ గడ్డం భరత్ బాబు మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులు అయోమయానికి లోను కాకుండా ధైర్యంగా పరీక్షలు వ్రాయాలని, ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని సూచించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ పరీక్షలకు చదువుకోవాలని, పట్టుదలగా చదివితే విజయం మీ సొంతం అవుతుంది. విద్యార్థి దశలో మీరు చేస్తున్న కృషి మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు.
పరీక్షల ఫలితాల తర్వాత విద్యార్థులు అనువైన గ్రూపులను ఎంచుకొని ఇంటర్మిడియట్ కోర్సుల్లో చేరాలని, మట్టిలో మాణిక్యాలుగా పోటీ ప్రపంచంలో విజేతలుగా తయారవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎం కవిత, ఉపాధ్యాయులు గోపాల్, కృష్ణ, కురుమూర్తి, గ్రామస్తులు శేఖర్ ఆచారి, విద్యార్థి నాయకులు జయరాముడు, అమిర్, ఆంజనేయులు, రాజు నాయుడు, సోమశేఖర్ నాయుడు, తిరుమలేష్, సిద్దార్థ పాల్గొన్నారు.
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్