Illegal Mining | గద్వాల : చెరువులను చెరబడుతున్న అక్రమార్కుల అంతు చూడాల్సిన పోలీసులే చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. జేసీబీలు పెట్టి చెరువును కొల్లగొడుతున్నారని ఫిర్యాదు చేస్తే.. నియోజకవర్గ ప్రజాప్రతినిధినే చెప్పాడంటూ పోలీసులు తప్పించుకుటున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పోలీస్ అధికారుల అండదండలతో అక్రమార్కులు చెరువుల్లో మట్టిని దర్జాగా తరలిస్తున్నారు.
కేటిదొడ్డి మండలం గంగన్ పల్లి శివారులో గల చెరువు నుంచి అక్రమార్కులు అడ్డూ అదుపు లేకుండా మట్టిని తరలిస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా చెరువుల్లో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. జేసీబీ సహాయంతో చెరువులో గుంతలు తవ్వుతూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి చదును చేయిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై కేటిదొడ్డి పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా.. మా దృష్టికి రాలేదని అన్నారు. ఏదైనా ఉంటే మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు ఉచిత సలహా ఇవ్వడం కొసమెరుపు. ఈ సమస్యను రెవెన్యూ, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి యత్నించగా.. వారు అందుబాటులోకి రావట్లేదని ప్రజలు చెబుతున్నారు.
Mancherial | కోనూర్లో విషాదం.. పంట చేను కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వైరుకు రైతు బలి
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు