BM Santhosh Kumar | జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2025 నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇవాళ జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని ఎస్.ఆర్. విద్యానికేతన్ (గద్వాల్), సరస్వతి స్కూల్ (ఎర్రవల్లి) పరీక్షా కేంద్రాలను కలెక్టర్ జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గదుల వసతులు, సీటింగ్ ఏర్పాట్లు, సీసీటీవీ నిఘా, వెంటిలేషన్, తదితర అంశాలను పరిశీలించి, పాఠశాల యాజమాన్యానికి అవసరమైన సూచనలు అందించారు.
మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి :
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నీట్ యూజీ-2025 (మే 4, 2025) నిర్వహణకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు తగినంత సీటింగ్ సామర్థ్యం ఉండేలా చూడాలన్నారు. అలాగే సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ప్రశ్నా పత్రాల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయాలు, పరిశుభ్రత, టాయిలెట్ వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, పరీక్షా కేంద్రాల వద్ద శుభ్రత, ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్ గని, కోఆర్డినేటర్ వెంకటేష్, ప్రిన్సిపాల్స్ రాములు,నందిని, సంబంధిత అధికారులు,పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు