గద్వాల, అక్టోబర్ 22 : ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే క ష్టాలు కొని తెచ్చుకున్నట్లే అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కా ర్యాలయంలో కేటీదొడ్డికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకు లు తాయప్ప, ఈరన్న, ఆంజనేయులు, జంగిలప్పతోపాటు మరో 30మంది బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాం గ్రెస్ అంటే కరెంట్ కోతల పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆ పా ర్టీకి ఓటు వేస్తే మూడుగంటల కరెంట్, బీజేపీకి ఓటు వేస్తే మోటర్లకు మీటర్లు బిగిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. కాం గ్రెస్ పాలనలో కరెంట్ కోసం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా లు చేశారని, వారికి ఓటు వేస్తే మరోసారి అదే పరిస్థితి తప్పదన్నారు. ప్రస్తుతం అమలు కాని హామీలతో అ ధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ రాష్ర్టాల్లో హామీలు నెరవేర్చలేక చతికిల పడిందన్నారు. అక్కడ క రెంట్ కోసం రైతులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆం దోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కరెంట్ కోతలు, సాగునీటి వెతలు, చివరికి రైతన్నకు గోస తప్పదన్నారు. రైతు వ్యతిరే క పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న సం క్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్న ట్లు వివరించారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భీమన్న, నాయకులు ఉరుకుందు, హనుమంతు, యుగంధర్‌గౌడ్, నాసిర్ తదితరులు పాల్గొన్నారు.