గద్వాల అర్బన్,నవంబర్ 23 : రోడ్డు ప్రమాదంలో గద్వాల యువకుడు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివా రం చోటు చేసుకున్నది. స్థానికుల సమాచారం మేరకు.. జోగుళాం బ గద్వాల జిల్లా కేంద్రంలోని కిష్టారెడ్డి బంగ్లా కాలనీకి చెందిన గ డ్డం లక్ష్మీనారాయణ కొడుకు గడ్డం బద్రీనాథ్(23) వాచ్ కంపెనీ లో ఉద్యోగం నిర్వహించేవాడు. అందులో భాగంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు ప్రైవేట్ బస్సులో తోటి ప్రయాణికులతో బయలుదేరాడు.
ఎన్హెచ్ 40 ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. అనంతరం ప్రైవేట్ ట్రా వెల్ బస్సును వెనుక భాగంలో మ రో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో 35మంది ప్ర యాణికులలో 15 మందికి తీ వ్ర గాయాలు అవ్వగా ఇద్దరు ప్రయాణికులు మృతి చెం దాడు. మృతి చెందిన వా రిలో గద్వాల వాసి బద్రీనాథ్ ఉండడంతో కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతితో కిష్టారెడ్డి బంగ్లా కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.