గృహజ్యోతి బిల్లింగ్‌లో లుకలుకలు
ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు వినియోగదారులకు ఉచితంగా కరెంట్ అందిస్తున్నది. ముందు నుంచి ఈ పథకంలో వి ద్యుత్ అధికారులు, సిబ్బంది వినియోగదారులపై అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వీటిలో అర్హత ఉన్న వారిని పరిగణలోకి తీసుకోకపోవడం, తీసుకున్న వారికి బిల్లింగ్ లో తప్పుడు లెక్కలు చూపి గృహజ్యోతి పథకానికి అమలు కాకుం డా చేయడంలాంటివి వరుసగా జ రుగుతున్నాయి.
- 195 యూనిట్లున్నా అమలు కానీ ఫ్రీ కరెంట్
- ఇతరుల పేరు చెప్పి బిల్లు వసూళ్లు
వనపర్తి, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు వినియోగదారులకు ఉచితంగా కరెంట్ అందిస్తున్నది. ముందు నుంచి ఈ పథకంలో వి ద్యుత్ అధికారులు, సిబ్బంది వినియోగదారులపై అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వీటిలో అర్హత ఉన్న వారిని పరిగణలోకి తీసుకోకపోవడం, తీసుకున్న వారికి బిల్లింగ్ లో తప్పుడు లెక్కలు చూపి గృహజ్యోతి పథకానికి అమలు కాకుం డా చేయడంలాంటివి వరుసగా జ రుగుతున్నాయి.
జూన్ 1వ తేదీన జిల్లాలో విద్యుత్ బిల్లింగ్ చే య డం షురూ అయ్యింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కేడీఆర్ నగర్ లో సర్వీస్ నెంబర్ 0101 16598కు ఇప్పటి వరకు గృహజ్యోతి పథకం అమలులో ఉన్నది. అయితే సోమవారం ఆ ప్రాంత లైన్మెన్ రమేశ్ బిల్లింగ్ తీశారు. ఈ సర్వీస్ కింద 195 యూనిట్లు కాలినట్లుగా చూపించారు. అయి తే, ఇదే సర్వీస్‌పై నార్మల్ నెల యూనిట్స్ లెక్క అంటూ 7యూ నిట్లను అదనంగా తీసుకొని 202 యూనిట్లుగా పరిగణించి రూ.1, 133 బిల్లింగ్ రసీదును ఇచ్చాడు.
దీనిని చూసుకున్న ఇంటి యజమాని లైన్మెన్ను వాకబ్ చేయగా ‘తానేమీ చేయలేదని.. బిల్లింగ్ మిషన్ తీసుకున్నదే నేను ఇచ్చానంటూ’ సమాధానం చెప్పి వెళ్లడంతో అవాక్కయ్యారు. ఇది లా ఉంటే, ఇదే విషయాన్ని డీఈ శ్రీనివాస్, ఎస్ఈ తిరుపతిరావు దృష్టి కి ‘నమస్తే తెలంగాణ’ తీసుకెళ్లిం ది. అధికారులు సహితం లైన్మెన్ చెప్పినట్లుగానే చూస్తాం.. చే స్తాం అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశా రు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని తప్పుడు చర్యలతో వినియోగదారులు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

