అయిజ, మే 31 : తుంగభద్ర తీరం కన్నీటి సంద్రంగా మారింది. తుంగభద్ర నదీ ప్రవాహంలో ఐదేళ్ల బాలుడితోపాటు నలుగురు గల్లంతై మృత్యువాత పడ్డారు. శనివారం ధనుశ్ మృతదేహం లభ్యం కాగా, ఆదివారం ఏపీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టి మరో నలుగురి మృతదేహాలను వెలికితీశారు. తాసీల్దార్ రమాదేవి, సీఐ దస్తగిరి తుంగభద్ర నదీ తీరంలో ఉంటూ పర్యవేక్షించారు. ఉదయం సతీశ్ (35), యవన్ చంద్ర (5) మృతదేహాలు లభ్యం కాగా, మధ్యాహ్నం సంధ్య (22), రాఘవేంద్ర (25)ల భౌతికకాయాలను వెలికి తీశారు. సతీశ్, యవన్ చంద్రలు తండ్రి కుమారులు. కుమారుడిని రక్షించేందుకు వెళ్లిన తండ్రితోపాటు మరో ముగ్గురు నీటి ప్రవాహంలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
శుభకార్యానికి వచ్చి ఆనందంగా ఉన్న వారి ఇళ్లల్లో తుంగభద్ర నదీ స్నానం తీవ్ర విషాదాన్ని నింపింది. మంత్రాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చి ఐదురుగు గల్లంతై మృత్యువాత పడిన ఘటన కర్నూల్ జిల్లాలోని మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదిలో శనివారం చోటు చేసుకొన్నది. ఐదేళ్ల బాలుడిని రక్షించబోయి నదీ ప్రవాహంలో మరో నలుగురు కొట్టుకుపోగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీసిన మృతదేహాలను ఎమ్మిగనూర్కు తరలించి పోస్ట్మార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు భౌతికకాయాలను అప్పగించారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువతి, యువకులు, తండ్రికొడుకులు మృతి చెందడం దురదృష్టకరమని పలువురు పేర్కొన్నారు.
పొలంలో నిప్పు.. భూ సారానికి ముప్పు..