పెళ్లింట విషాదం
కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా, మాన్వి తాలూకా, కుర్డ్ది గ్రామంలోని పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. కుర్డి గ్రామానికి చెందిన దాసరి ఆదిశేషు కుటుంబంలో జరిగిన పెండ్లి కి వారి కుటుంబ సభ్యులు కర్నూల్ జిల్లా కోస్గి మండలం, కందుకూరు గ్రామంలో జరిగిన పెండ్లి వేడుకలకు శుక్రవారం వెళ్లారు.
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి
- సరదా కోసం వెళ్లి మృత్యువాత పడిన వైనం
- కర్నూల్ జిల్లా కోస్గి మండలం ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద ఘటన
అయిజ, మార్చి 27 : కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా, మాన్వి తాలూకా, కుర్డ్ది గ్రామంలోని పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. కుర్డి గ్రామానికి చెందిన దాసరి ఆదిశేషు కుటుంబంలో జరిగిన పెండ్లి కి వారి కుటుంబ సభ్యులు కర్నూల్ జిల్లా కోస్గి మండలం, కందుకూరు గ్రామంలో జరిగిన పెండ్లి వేడుకలకు శుక్రవారం వెళ్లారు. పెండ్లి అనంతరం అగసనూరు గ్రామ సమీపంలోని తుంగభద్ర నది వద్దకు సరదాగా 20మంది స్నానానికి వెళ్లారు.
తుంగభద్ర న దికి నీటి ప్రవాహం పెరగడంతో స్నానానికి వెళ్లిన నలుగురు దాసరి ఉమావతి (28), దాసరి రత్నమ్మ (26), దాసరి మహంతేశ్ (20), దాసరి శివానంద్ (20)లు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో గల్లంతై మృత్యువాత పడ్డారు. అక్క డ ఉన్న స్థానికులు నలుగురిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో తుంగభద్ర నది ప్రాంతం విషాదంతో మునిగింది. కోస్గి మండలంలోని కందుకూరు.
మాన్వి తాలూకాలోని కురివి గ్రా మాల్లో రోదనలు మిన్నంటాయి. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు ఈనెల 20వ తేదీ కేసీ కెనాల్ ఇం డెంట్ 4.7 టీఎంసీల నీటిని తుంగభద్ర జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతోనే ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం పెరిగిందని కోస్గి మండల ప్రజలు పేర్కొంటున్నారు. తుంగభద్ర నదిలో నీటి మునిగి నలుగురు మృతి చెందిన ఘటనపై కోస్గి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

