నారాయణపేట, నవంబర్ 9 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని 102, 103, 104, 105, 150, 196 బూత్‌లలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి భారీ ఊరేగింపు చేపట్టారు. 2వేల మంది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన ఓటర్లతో డప్పు వాయిద్యాలతో ఊరేగింపు చేపట్టి సీరియల్ నమూనా బ్యాలెట్ చూపిస్తూ నెంబర్ 3లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
కొత్తకోట/మూసాపేట, నవంబర్ 9 : హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో నివసిస్తున్న కల్పతెరువు అపార్ట్మెంట్లో నివసిస్తున్న కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఎర్రగడ్డలో బీఆర్ఎస్ అభ్యర్థి మా గంటి సునీతను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది విజయకుమార్, మాజి జెడ్పీటీసీ విశ్వేశ్వర్, మాజీ కౌన్సిలర్ పద్మ అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
గుండుమాల్, నవంబర్ 9 : జుబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బీఆర్ఎస్ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి గుండుమాల్ బీఆర్ఎస్ నేతలతో కలిసి కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండట్టారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ మాజీ జెడ్పీటీసీ మహిపాల్, సురేశ్, నాయకులు శరత్‌గౌడ్, సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.