మద్దూర్ (కొత్తపల్లి), సెప్టెంబర్ 23: మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సోమవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కే టాయించి వైద్యపరికరాలను ఏర్పాటు చేస్తే.. ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వం మక్తల్ దవాఖానకు ఎం దుకు తరలించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలకు పరికరాలు అవసరం లేదా అని ఖండించారు.
సీఎం రేవంత్ నియోజకవర్గంలోనే ఇలా ఉంటే రాష్ట్రమంతా పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రోగులకు మందుల్లేక మూడు నెలలవుతుందంటే అధికారు లు, ఆరోగ్యశాఖ మంత్రి ఏం చేస్తున్నారని విమర్శించా రు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా చై ర్మన్ శాసం రామకృష్ణ, కోస్గి మార్కెట్ కమిటీ మాజీ చై ర్మన్ వీరారెడ్డి, బీఆర్ఎస్ మద్దూర్ మండలాధ్యక్షుడు గోపాల్, కొత్తపల్లి మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు సలీం, శేఖర్, బసిరెడ్డి, బుగ్గ ప్ప, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.