కల్వకుర్తి, జూలై 31 : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ ఉన్నదని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఎద్దేవా చేశారు. కేవలం బీఆర్ఎస్ నాయకులను తిట్టడానికే కాంగ్రెస్ పెట్టుకున్న ఎన్నికల సభలా ఉన్నదని మండిపడ్డారు. బుధవారం కల్వకుర్తిలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో క లిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి అంటే అందరికీ గౌరవం ఉన్నద ని, పార్టీలకతీతంగా ఆయనకు ఎం దరో అభిమానులు ఉన్నారన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చే యడాన్ని పార్టీలకతీతంగా అం దరం స్వాగతిస్తున్నామన్నా రు.
వచ్చిన చిక్కల్లా ఏమిటం టే.. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని, బహిరంగ సభ ను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా మార్చారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతానికే కాకుం డా, దేశానికి ఎనలేని సేవ చేసిన పెద్ద మనిషిని స్మరించుకునే కార్యక్రమా న్ని రాజకీ య కార్యక్రమం మార్చారని విమర్శించారు. అధికారిక కార్యక్రమైతే ప్రొటోకాల్‌కు విరుద్ధంగా పార్టీ కార్యక్రమంలా ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. కలెక్టర్, ఎస్పీతోపాటు ఉన్నత స్థాయి అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారన్నారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సబబేనా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ ప్రాంత ప్రజలకు సేవలందించిన జైపాల్‌రెడ్డి పేరును పాలమూరు ఎత్తిపోల పథకానికి పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బడేబాయి పీఎం మోదీని ఒప్పించి ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ ప్రాంత అభివృధ్ధికి నీతినిజాయితీతో జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి మహేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యేలు ఎడ్మ కిష్టారెడ్డి, ధ్యాప గోపాల్‌రెడ్డి పనిచేశారని చెప్పిన రేవంత్ తమను అవమాన పరిచాడని మండిపడ్డారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా తాను, మాజీ మంత్రిగా రాములు ఈ ప్రాంతానికి నీతినిజాయితీలో పనిచేయలేదా? అంటూ నిలదీశారు. దాదాపు రూ.5 వేల కోట్లతో కల్వకుర్తి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును దాదాపు రూ.35 వేల కోట్లు ఖర్చుపెట్టి 60 టీఎంసీలు నీరు నిల్వ ఉండేలా భారీ రిజర్వాయర్లను నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు కేవలం కాల్వల పనులు పూర్తి చేసి దాదాపు 12.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ఎమ్మెల్యేకు ఈ ప్రాంత సమస్యలు, అభివృద్ధిపై కనీస అవగాహన లేదనిపిస్తుందని దుయ్యబట్టారు. ఒకవేళ ఉంటే కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని మరిచి అవే పనులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌ను అడగటం చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు. కల్వకుర్తిలో 50 పడకల దవాఖానను నాడు 100 పడకలుగా మారుస్తూ 2023 జూన్ 28న 366 జీవో ఇచ్చి మూడెకరాల స్థలం కేటాయించడంతోపాటు నిధులు మంజూరు చేయగా.. టెండర్ పూర్తయి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నాడని వివరించారు. ఇప్పుడేమో స్థానిక ఎమ్మెల్యే వంద పడకల దవాఖాన కావాలని అడగడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
ఏమైనా మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, పారిశ్రామిక కారిడార్, ఇతర అభివృధ్ధి పనులను అడిగితే టీవీలు చూస్తున్న తామందరం సంతోషించామని, తీరా రేవంత్‌రెడ్డి ఇరవై, ముప్పై కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి పుట్టిన గడ్డకు శూన్య హస్తం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం ఏమిటంటే కల్వకుర్తిలో సీఎంకు ఇళ్లు కూడా ఉంది.. ఈ ప్రాంతంలోనే చిన్నతనంలో ఆయన చక్కర్లు కొట్టారు.. అయినా ఈ ప్రాంతంపై ఆయనకు ఏమాత్రం ప్రేమలేదనే అర్థమవుతుందన్నారు. పరిపాలన విషయానికొస్తే ‘తుంమారో.. మై మారుంగా’ అన్నట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు.
రుణమాఫీ కేవలం 23 శాతం రైతులకు మాత్రమే ఇస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని, రైతు భరోసాకు ఎగనామం పెట్టినట్టేనని, ఆరు గ్యారెంటీలకు ఇక మంగళమేనని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృధ్ధిలో ముందుకు సాగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అన్నారు. సమావేశంలో సింగిల్ విండో అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, బాలయ్య, చెన్నకేశవులు కౌన్సిలర్ సూర్యప్రకాశ్‌రావు, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.