వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ( BRS ) యువ నాయకులు పిల్లి శ్రీను ముదిరాజ్‌ను కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ ( Jaipal Yadav ) శనివారం పరామర్శించారు. పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు, చేతు విరిగిన ముదిరాజ్‌ను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా రూ. 5వేలు ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ విజితా రెడ్డి, మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ నిరంజన్, మాజీ సర్పంచ్ తిరుమలరావు, యూత్ వింగ్ అధ్యక్షులు జంగిల్ యాదగిరి, పోలే అశోక్, జోగయ్య, శేఖర్, ఈదులపల్లి శ్రీనివాసులు, గణేష్, శ్రీను, హనుమంతు, గంగాధర్, కిషన్, శంకర్ పాల్గొన్నారు.