వెల్దండ, అక్టోబర్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వానికి బడు గు, బలహీన వర్గాల ప్రజల శాపనార్థాలు, ఉసురు త గిలి కూలిపోవడం ఖా యమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. వెల్దండ మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవా రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేశారన్నారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చడానికి ఎవరు అధికారమిచ్చారని ప్రశ్నించారు.
ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టకుండానే 300 రోజుల్లో రూ.80 వేల కోట్ల అప్పు ఎందుకు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు అదుపుతప్పాయని, ఎక్కడ చూసినా హత్యలు, హత్యాచారాలు, దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించారు. రూ.25 వేల కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల చేపడితే.. మిగిలిన పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్న బడా బాబులను వదిలేసి.. కూలీనాలీ చేసుకునే పేదల ఇండ్లు కూల్చి వారిని రోడ్డున పడేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
కల్వకుర్తి కాటన్‌మిల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో కాం గ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. సీఎం సొంత జిల్లాలో ఆ పార్టీ ఓడిపోవడమే అందుకు నిదర్శనమన్నారు. అధికారం అడ్డుపెట్టుకొని ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. కార్మికులు బీఆర్ఎస్ పక్షాన నిలిచారని, సూర్య ప్రకాశ్‌రావు మూడోసారి విజయం సాధించడం హర్షణీయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, యాదగిరి, అశోక్, ప్రసాద్, కొండల్‌యాదవ్, లాలయ్య, రాజు, శ్రీను, రవి, హన్మంతునాయక్, పత్యానాయక్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.