కల్వకుర్తి, ఏప్రిల్ 12 : వరంగల్ ఈనెల 27న గులాబీమ యం కావాలని, బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఏడు మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జైపాల్‌యాదవ్ రజతోత్సవ బహిరంగస భ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో కనీవిని ఎరుగుని రీతిలో రజతోత్సవ సభ ఉంటుందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ని 7మండలాలకు 35 బస్సులు కేటాయించడం జరిగిందని, ప్రతి మండలానికి 5బస్సుల చొప్పున విభజించామని, 27న గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాలను ఎగురవేసి గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
జెం డాలు, బ్యానర్లు, టోపీలు సామగ్రి అంతా సిద్ధంగా ఉం దని, గ్రామాల వారీగా పంపిణీ చేయాలని సూచించారు. బహిరంగ సభకు తరలివెళ్లే అంశంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. పండుగ మాదిరిగా రజత్సోవానికి తరలిరావాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ స త్యం, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు విజితారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, కార్మిక సంఘ నాయకుడు సూర్యప్రకాశ్‌రావు, మాజీ కౌన్సిలర్ బావండ్ల మధు, నాయకులు రాంరెడ్డి, బాల య్య, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.