అమరచింత,మార్చి 27 : ఆత్మకూరు పట్టణంలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్నాల రమేష్ మాతృమూర్తి పుట్నాల సావిత్రమ్మ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పుట్నాల సావిత్రమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళుల ర్పించారు. అనంతరం రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
పుట్నాల రమేష్ కుటుంబ సభ్యులంతా మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, ఆరేపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అజభాగం ఆసన్న, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చెన్నయ్య, కో ఆప్షన్ సభ్యులు రియాజ్ అలీ, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.