మక్తల్, ఏప్రిల్ 20 : మంత్రి వాకిటి శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాని నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హితవు పలికారు. మక్తల్‌లో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడారు. నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భా గంగా నిర్మిస్తున్న మినీ కానుకుర్తి ప్రాజెక్టు పనులకు భూ మిపూజ చేస్తూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఆగం చేసింది కేసీఆర్ ప్రభుత్వమని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయా ంలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు 90శాతం పనులు పూర్తయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏండ్లు గడుస్తున్నప్పటికీ ఒకరోజైనా ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ప్రాజెక్టు పనులను పూర్తిచేద్దామని ఆలోచించిన పాపాప పోయ్యారా అని మంత్రి గుర్తు చేసుకోవాలని సవాల్ విసిరారు. నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు నుంచి మక్తల్ నియోజకవర్గంలో కేవలం 13వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, కానీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనే విషయాన్ని మంత్రి వాకిటి శ్రీహరి తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి వాకిటి శ్రీహరి ఇరిగేషన్‌పైన అవగాహన లేకుండా పాలమూరు-రంగారెడ్డిపై మాట్లాడటం చూస్తుంటే ఆయనకు ఆరోపణలు చేయడం తప్పా అభివృద్ధిపై ఎలాంటి దృష్టి లేదని బహిర్గతమవుతుందన్నారు. కృష్ణానది నుంచి భీమా ఫేజ్ వన్‌కు నీటిని ఎత్తిపోసే చిన్న గోపులాపూర్ స్టేజ్ వన్ పంప్ హౌస్ నుంచి 1100క్యూసెకుల నీటిని తరలించే సామర్థ్యం గల కెనాల్లో కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టు కోసం యాభై క్యూసెకుల నీటిని తోడే పంప్‌ను స్టేజ్ వన్ కంపాస్‌లో బిగించి నీటిని ఎత్తిపోస్తే కెనాల్ సామర్థ్యం సరిపోతుందా అనే విషయం కూడా వీరికి అవగాహన లేదని అన్నారు. కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టు నుంచి రైతులకు మేలు చేస్తే అందరం సంతోషిస్తాం కానీ, మక్తల్ నియోజకవర్గంలో భీమా ప్రాజెక్టుకు నష్టం చేకూరేలా చర్యలు కాంగ్రెస్ చేపడితే తరిమికొట్టేందుకు వెనకాడబోమని అన్నారు.
సీఎం మక్తల్ నుంచి నారాయణపేటకు వెళ్లే రో డ్డును నాలుగు లేన్లు మారుస్తూ భూమి పూజ చేసి వదిలేశారు తప్పా నేటి వరకు పనులు ప్రారంభించలేదన్నారు. మంత్రి రో డ్డు పనులను ప్రారంభించడంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. ఒక నెలలోపు నారాయణపేట రోడ్డు పనులను ప్రారంభించక పోతే మంత్రి వాకిటి శ్రీహరి ఇంటి ముట్టడించి పనులు ప్రారంభించేంతవరకు మం త్రిని వదిలిపెట్టబోమని చిట్టెం హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధికి చిట్టెం కుటుంబం నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి పేట సభలో ప్రసంగించినప్పుడు మంత్రికి వినపడలేదా అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం ప్రశ్నించారు.
అభివృద్ధి జరిగితే స్వాగతి స్తాం తప్పా అభివృద్ధిని అడ్డుకునే అలవాటు తమ కుటుంబంలో లేదని మాజీ ఎమ్మెల్యే పేరొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సూల్ నియోజకవర్గానికి ఒకటి మంజూరయ్యాయని మంత్రి చెబుతున్నారు.. కదా ఆ పాఠశాలలో ఎకడ ఉన్నాయని ఒక చూపించాలని ప్రశ్నించారు. ప్రస్తుతం యాసంగి పంటలో రైతులకు సాగునీరు లేక వందలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. రిజర్వాయర్లలో నీటి నింపే సోయి కాంగ్రెస్ నాయకులు లేకపోవడంతెనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించే సోయి మంత్రికి ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు.
మంత్రి మాట్లాడే విషయాలన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని అభివృద్ధి పనులపై దృష్టి పెడి తే బాగుంటుంది లేకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదురోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని మాజీ ఎ మ్మెల్యే చిట్టెం హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ గాలిరెడ్డి, ప ట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మొగులప్ప, నాయకులు అన్వర్, మన్నన్, ఈశ్వర్ యాదవ్, అమ్రేశ్, మహమూద్, సాగర్, శివారెడ్డి, రాఘవేందర్ ఉన్నారు.