మక్తల్, జూలై 16 : రైతులకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు ఉన్నా దిగువకు నీటిని విడుదల చేయించే సత్తా ఈ ప్రభుత్వానికి లేద ని ఎద్దేవా చేశారు. గురువారం ఆయ న మక్తల్ మండల రైతులతో కలిసి భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ (సంగంబండ) రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్లకు కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోసే భీమా స్టేజ్-1 పంప్ హౌస్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మా ట్లాడుతూ 15 రోజుల నుంచి కృష్ణానదికి స్వల్పంగా ప్రవాహం వచ్చినా ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసే పంప్‌హౌస్‌కు రావలసిన వరదనీరు రాకుండా పంచదేవ్పాడు గ్రామం వద్ద గ్రావిటీ కెనాల్ గేట్లను మూసి వేయడం వల్ల స్టేజ్-1 పంప్ హౌస్‌కు నీటి లెవెల్ చేరకుండా ఉందన్నారు. స్థానిక మంత్రి, నీటి పారుదాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే నేడు మక్తల్ నియోజకవర్గంలో రైతాంగానికి సాగునీరు అందే అవకాశం లేకుండా పో యిందన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి అదే పార్టీకి చెందిన వారు అయినప్పటికీ నీటి విడుదల విషయంలో సం ప్రదింపులు చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని, దీంతో భీమా కింద సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితులు తలెత్తాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి ఇప్పటికైనా స్పందించి ఎగువ రాష్ర్టాలతో మాట్లాడి దిగువకు నీరు విడుదల చేసి పంటలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సర్పంచులు గాల్‌రెడ్డి, శ్రావణ్, వీరారెడ్డి, ఆంజనేయులుగౌడ్, శంకర్, మాజీ ఎంపీటీసీ ఆశిరెడ్డి ఉన్నారు.