హన్వాడ/ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 1 : తెగిపోయిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి వినియోగంలో కి తీసుకురావాలని మాజీ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇబ్రహీంబాద్ సమీపంలోని చించోలి- మహబూబ్‌నగర్ ప్రధాన రహదారి తెగిపోవడంతో ఆదివారం శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చించోలి-మహబూబ్‌నగర్ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
రోడ్డు తెగిన వెంటనే మరమ్మతులు నిర్వహించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం ఏమిటని మండిపడ్డారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు మండలంలోని వేపూర్, గొండ్యాల వా గుపై నాలుగు చెక్‌డ్యాంలు మంజూరు చేయించానని వాటికి సంబంధించిన పనులు నేటికీ ప్రారంభించలేదని, ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టిన వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
అనంతరం పెద్దదర్పల్లి, హన్వాడ చెరువులు అలుగుపారడంతో వాటిని పరిశీలించి పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, మాజీ ఎంపీటీసీలు నాగన్న, చెన్నయ్య, మాజీ జెడ్పీటీసీ నరేందర్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంబులయ్య, మాజీ సర్పంచులు వెంకన్న, చిన్నచెన్నయ్య, నాయకులు అన్వర్, రామ్‌గౌడ్, మాధవులుగౌడ్, శ్రీనివాసులు, అనంతరెడ్డి, తేజవర్ధన్, యాద య్య ఉన్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీలో నీట మునిగిన ప్రాం తాలను మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. స్థానికులకు తాను అండగా ఉన్నానని భరోసా కల్పించారు. ఆయన వెంట స్థానిక కౌన్సిలర్ పటేల్ ప్రవీణ్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.