మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పాలమూరు : పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు ఈ టైంలో ఎక్క డ ఉంటున్నారు.. యూరియా కోసం క్యూ లైన్ లో ఉంటున్నారు.. రాత్రిపూట రైతులు ఎక్కడ పడుకుంటున్నారు..? యూరియా కోసం పీఏసీ సీఎస్ల ఎదుట పడుకుంటున్నారు.. పొలాలవద్ద ఉన్న రైతులను రోడ్డుమీదికిడ్చి మన బతుకులు ఆగం చేసిన ప్రభుత్వమిది… ఒకవైపు యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ మాత్రం సంబురాల్లో పాల్గొనడం ఏంటని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు.
కాళేశ్వరంపై పథకం ప్రకారం కుట్ర ప న్నుతూ కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని విరు చుకుపడ్డారు. బుధవారం మహబూబ్‌నగర్ మండలం కోడూరు అప్పాయిపల్లి గ్రామాల మధ్య రైతు నిరసన దీక్షలో పాల్గొన్నారు. అనంతరం పీఏసీసీఎస్ వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు ల నిర్దేశించి మాజీ మంత్రి మా ట్లాడుతూ యూరియా కోసం పదేండ్లలో రైతులను ఇబ్బం ది పెట్టకుండా ముందస్తు ప్రణాళికలు చేసి యూ రియా అందించిన ఘనత కేసీ ఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులకు యూ రియా ఇస్తలేడు కరెంటు సక్కగా లేదు.. ఇదేం మా ర్పు అంటూ నిలదీశారు.
మార్పు మార్పు అం టూ ప్రజలను ఏ మార్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. తిండితిప్పలు లేక రైతులు యూ రియా కోసం అగచాట్లు పడేలా చేసిన ఈ ప్రభు త్వానికి పరిపాలించే అర్హత లేదన్నారు. ఈ సందర్భంగా రైతు వెంకటయ్యతో మాజీ మం త్రి మాట్లాడించారు. ఆడోళ్లకు అవి ఇస్తామని.. ఇవి ఇస్తామని.. ఏదో చేస్తామని.. చెప్పి అధి కారంలోకి వచ్చిండ్రు.. ఆడోళ్లను మోసం చేసి.. ఫ్రీ బస్సు పెట్టిండు.. బస్సు ఎక్కితే ఆడోళ్లు కొట్టు కునే పరిస్థితికి తెచ్చిండు.. గుండు సున్నా పెట్టిం డు.. అని మండిపడ్డారు.
అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు..
సోషల్ మీడియాలో మమ్మల్ని బీఆర్ఎస్ నేతల ను టార్గెట్ చేస్తూ అడ్డగోలుగా పోస్టులు పెట్టి స్తున్నారు.. ఏమన్నా అంటే అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నారు.. ప్రజలు అంత గమని స్తున్నారు… ఎవరు ఏమేమి నాటకాలు ఆడుతు న్నారని చూస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రజలకు ఒక్క మంచి పనిచేస్తున్నారా? బ్రోకర్ల పనిచేస్తున్నారా? అన్ని బయటపడతాయి అని హె చ్చరించారు. అందరి అవినీతి చిట్టా రాసి పెట్టు కోండి.. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అని రాసి పెట్టుకోండి అవినీతిపరుల భరతం పడదాం అని పిలుపునిచ్చారు.
సీఎం జిల్లాలో రైతులు అనేక కష్టాలు పడుతున్నారు.. ఇవన్నీ కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. జిల్లాకు సీఎం వస్తున్నాడు అని తెలిసి అరకొరగా ఎరువులను పంపించారని.. రాత్రనకా పగలనకా రైతులు మహిళలు పీఏసీసీఎస్‌ల ఎదు ట పడుకుంటున్నారని ఇదేం ప్రజాపాలన అం టూ ఎద్దేవా చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు యూరియా కేంద్రాలకు వద్దకు వచ్చి చూడాలని సవాల్ విసిరారు. ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్న రైతులకు 10,20 ఎకరాల ఉన్న రైతులకు కూడా ఒకటే యూరియా బస్తా ఇస్తున్నారని.. ప్ర తి రైతుకు కనీసం ఐదు బస్తాలు యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మొదటి విడుతకే యూరియా పంపిణీ ఇంత ఆలస్యమైతే రెండో విడుత ఇంకెప్పుడు పంపిణీ చేస్తారని ప్రశ్నిం చారు. వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందని అన్నారు. కేం ద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఒక్క టై ప్రజలను నట్టేట ముంచుతున్నారని విమర్శి ంచారు. గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా అధికారులు యూరియా అందించడం లేదని మండిపడ్డారు. తిండి తినకుండా.. రాత్రిళ్లు వర్షంలో నిద్ర లేకుండా యూరియా కేంద్రాల వద్ద రైతులు పడుకుంటున్నా వారికి యూరియా అం దడం లేదన్నారు.
ఇసుక యూరియా కలుపుకొని చల్లాలి అని వ్యవసాయ మంత్రి అవగాహన లేకు ండా మాట్లాడుతున్నారు. పంటలు యెట్లా పండు తున్నాయి అనేది కూడా మంత్రులకు అవగాహన లేకుండా మాట్లాడడం ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా? అని నిలదీశారు. ముఖ్య మంత్రి సొంత జిల్లాలో రైతుల పరిస్థితి దారు ణంగా ఉంది. ముఖ్యమంత్రి పర్యటన ఉన్న సమ యంలో కూడా రైతులు యూరియా కోసం వరు సల్లో నిలబడిన పరిస్థితి జిల్లాలో ఉంద న్నారు. కాంగ్రెస్ పాలనలో యూ రియా కోసం చెప్పులు లైన్లో పెడుతున్నారు.. లైన్లో ఉన్న వారు ఆకలితో సొమ్మసిల్లి పడుతు న్నార ని తెలిపారు.
రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని అడిగితే రాజకీయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో మంత్రులు, అధికారులు పర్యటిస్తే వాస్తవం తెలుస్తదన్నారు. యూరియా వేయకుంటే ఎకరాకు 40 సంచులు బదులుగా 20 సంచులు వస్తాయి.. రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు తిరిగి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకొని రైతులకు అవ సరమైన ఎరువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో గ్రంథా లయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షు డు దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ ఎంపీపీ సుధాశ్రీ, పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాఘవే ందర్, అల్లావుద్దీన్, ఊశన్న, శ్రీకా ంత్గౌడ్, రాంచంద్రయ్య, శేఖర్ , వెంకటయ్య, రవీందర్‌రెడ్డి, కృష్ణయ్య, శ్రీనివాస్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.