మహబూబ్‌నగర్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్లు.. ఐదేండ్లకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి .. ఇప్పుడు కేవలం 3.85 శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయించారని.. అందులో కేవలం రూ.5 వేల కోట్లు మాత్ర మే ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మొం డిచేయి చూపించిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్‌నగర్‌లో మీడి యా ఎదుట బడ్జెట్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచిందన్నారు. సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెడుతుందనుకున్నాం.. కానీ పెట్టలేదు.. మూడు బడ్జెట్లు పూర్తయినా ఎవరికి న్యా యం చేయలేదన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు.. 11 డిక్లరేషన్లకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన లేదని విమర్శించారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకుండా ప్రభుత్వం చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. మూడుసార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెనుకబడిన తరగతులను దగా చేసిందని, ఈసారి బీసీలకు రూ.50 వేల కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పథకం ప్రకారం బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దళితులకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు నిధులు ఇవ్వాల్సిందే.. అలాగే ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ అమలు చేయాలన్నారు. బీసీ గురుకులాల్లో అన్నం సరిగ్గా లేక విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని, మైనారిటీ గురుకులాల్లో వసతులు లేక ఖాళీ అవుతున్నాయన్నారు.
సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పిందని.. ఉద్యోగులకు వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇ వ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రైతు భరోసా, కరెంట్ ఇవ్వడం లేదని, అవసరమైన యూరియా అందించడం లేదని, పండించిన పం టకు కనీసం మద్దతు ధర రావడం లేదన్నారు. ఇదేం ప్రభుత్వమని వాపోయారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, ప్ర భుత్వ దవాఖానలు పెద్దమొత్తంలో అభివృద్ధి చేశామని, రాష్ట్ర సంపద పెంచడంతో ఆ స్తుల విలువ కూ డా పెరిగిందని గుర్తు చేశారు.
కానీ కాంగ్రెస్ వచ్చాక పెరిగిందా? తగ్గిందా? ఆలోచన చేసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని తిరోగమనంలోకి నెట్టే బడ్జెట్ ఇది.. అంకెల గారడీ తప్పా ఏమీ లేదన్నారు. అన్ని పార్టీలు ఒత్తిడి తీసుకొచ్చి అన్ని వర్గాలకు అనుకూలమైన బడ్జెట్ రూపకల్పనకు ఒత్తిడి తేవాలన్నారు. సమావేశంలో మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రహ్మాన్, కార్పొరేటర్లు కి శోర్, మూస నరేందర్, నరేశ్, శ్రీశైలం యాదవ్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.