ఆటో డ్రైవర్ల పొట్టకొట్టొద్దు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఇప్పటికే చాలా మంది ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయారని, వందలాది మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని కావున పోలీసులు, ఆర్టీసీ అధికారులు వారి పొట్టకొట్టకుండా మానవతా దృక్పథంలో వ్యవహరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు.
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు
- పాలమూరులో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ఆటో డ్రైవర్ల సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిన మాజీ మంత్రి
- కృతజ్ఞతలు తెలియజేసిన ఆటో డ్రైవర్లు
మహబూబ్‌నగర్, జూలై 16 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఇప్పటికే చాలా మంది ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయారని, వందలాది మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని కావున పోలీసులు, ఆర్టీసీ అధికారులు వారి పొట్టకొట్టకుండా మానవతా దృక్పథంలో వ్యవహరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. మహబూబ్‌నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆటోలు ఆపొద్దని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో గురువారం ఆటో డ్రైవర్లు బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహించగా పోలీసులు వారిని టుటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెంటనే టుటౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆటో డ్రైవర్ల సమస్యను తెలుసుకొని వారితో కలిసి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించారు.
ఈ సందర్భంగా అధికారులు ఆటో డ్రైవర్ల బస్టాండ్ ముందు కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్లు ప్రయాణికుల కోసం ఆటోలు అపుతున్నారని, బస్సులు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతున్నదని తెలిపారు. స్పందించిన మాజీ మంత్రి అధికారులు వాటిని అక్కడ ఆపడానికి అనుమతి ఇవ్వకుంటే ఆటో కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతాయని, పిల్లల చదువులు కుటుంబ పోషణ, రుణాలు చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఇప్పటికే ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని గుర్తు చేశారు. అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని అధికారులకు సూచించారు. అధికారులు సూచించిన విధంగా బస్టాండ్ ము ందు ఆటోలు కార్మికులు నిలుపుకొంటారని అనుమతి ఇవ్వాలని కోరారు.
క్రమపద్ధతిలో ఆటోలు నిలిపి ప్రయాణికులను తీసుకువెళ్లాలని, బస్సులకు ఇబ్బంది కలిగించకుండా చూడాలని అధికారులు ఆటో డ్రైవర్లకు సూచించారు. దానికి ఆటో డ్రైవర్లు ఒప్పుకోవడంతో ఆటోలు నిలుపుకొనేందుకు అవకాశం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యపై స్పందించి పరిష్కారానికి చొరవ తీసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

