అమెరికాలో వనపర్తి యువకుడు మృతి
వనపర్తి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్ ఆదివారం అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసుకున్న దినేశ్ ఎంఎస్ చదివేందుకు గతేడాది డిసెంబర్ 28న అమెరికా వెళ్లాడు.
- కుటుంబసభ్యులకు పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి టౌన్, జనవరి 14 : వనపర్తి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్ ఆదివారం అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసుకున్న దినేశ్ ఎంఎస్ చదివేందుకు గతేడాది డిసెంబర్ 28న అమెరికా వెళ్లాడు. కాగా, శనివారం రాత్రి భోజనం చేసి రూంలో పడుకున్న విద్యార్థి నిద్రలోనే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడై తిరిగి వస్తాడని ఆశించిన కుటుంబ సభ్యులు మరణవార్త తెలుసుకొని లబోదిబోమంటున్నారు. దినేశ్‌తోపాటు బీటెక్ పూర్తి చేసిన మరో తెలుగు విద్యార్థి కూడా రూంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దినేశ్ మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే, దినేశ్ మృతి వార్తను తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎదిగి వచ్చిన కొడుకును కోల్పోవడం చాలా దురదృష్టకరమని ధైర్యంగా ఉండాలని, ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని భరోసా కల్పించారు. పార్థివదేహాన్ని ఇండియాకు రప్పించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మాట్లాడుతానన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఫోన్లో పరామర్శించారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, కౌన్సిలర్లు ప్రేమ్‌నాథ్‌రెడ్డి, రవి, కృష్ణ, చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు అశోక్, జాత్రునాయక్, రాము, ముత్తుకృష్ణ, చెన్నరాములు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

