మహబూబ్ నగర్ : జిల్లాలోని తిమ్మజిపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి డాక్టర్సి.లక్ష్మారెడ్డి సతీమణి చర్లకొల శ్వేత స్మారకార్ధం జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్(Volleyball Tournament) ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్ ను మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి ( Laxma reddy ) ప్రారంభించారు.
ఈ టోర్నీలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి మొత్తం 35 టీంలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. తొలిరోజు బిజినేపల్లి, షాద్ నగర్ జట్లు పాల్గొనగా క్రీడాకారులను మాజీ మంత్రి పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఆయన ఉత్సాహపరిచారు. టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.