అమ్రాబాద్, ఆగస్టు 15 : కరెంట్ తీగలతో అడవి జం తువును చంపి మాంసాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి కల్వకుర్తి జైలుకు తరలించిన ఘటన మండలంలోని వంగూరోనిపల్లిలో గురువారం చోటుచేసుకున్నది. ఎఫ్ఆర్వో గురుప్రసాద్ కథ నం మేరకు.. మండలంలోని వంగూరోనిపల్లి గ్రామంలో ఈ నెల 12వ తేదీన కరెంట్ తీగలతో అడవి జంతువు (కణతి)ను చంపి దాని మాంసాన్ని తరలిస్తున్న పిల్లి సా యిలు,
జక్క నర్సింహరావు, కడారి అంజయ్యలను ప ట్టుకొని వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమో దు చేసినట్లు చెప్పారు. విచారణ నిర్వహించిన అనంత రం బుధవారం కోర్టులో వారిని హాజరుపర్చగా జడ్జి రి మాండ్ విధించి కల్వకుర్తి సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న వారిలో అటవీ అధికారులు వాణికుమారి, ఖాజామైనోద్దీన్, బీట్ అధికారు లు నాగేశం, శారద, గోపాల్, సిబ్బంది వీరయ్య, లక్ష్మణ్, బాలకిష్టయ్య, బేస్‌క్యాంప్ వాచర్లు ఉన్నారు.