గద్వాల, జూన్ 23 : జూరాలకు వరద నిలకడగా కొనసాగుతున్నది. సోమవారం ఇన్‌ఫ్లో 45,000 క్యూసెక్కులు నమోదు కాగా మూడు గేట్లు ఎత్తి 12,246 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి 36,430, భీమాలిఫ్ట్-1కు 650, భీమా-2కు 750, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315, జూరాల ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 500, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, సమాంతర కాల్వకు 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మొత్తం అవుట్ ఫ్లో 51,957 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.8710 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అయిజ, జూన్ 23 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. సోమవారం తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 21,950 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 194 క్యూసెక్కులు ఉన్నది. గరిష్ఠ నీటిమట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1614.09 అడుగుల నీటిమట్టం ఉన్నది. అదేవిధంగా 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 46.290 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 290 క్యూసెక్కులు కొనసాగుతుండగా, సుంకేసులకు 185 క్యూసెక్కులు విడుదలు చేస్తున్నారు.