జడ్చర్ల, ఆగస్టు 20 : జడ్చర్ల మండలంలో మంగళవారం ఉదయం భారీవర్షం కురిసింది. దీంతో జడ్చర్ల ము న్సిపాలిటీలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షపునీరంతా రోడ్లపై పారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జడ్చర్ల పాతబజార్, పెద్దగుట్ట, పద్మావతీకాలనీ, తాలూకా క్లబ్ ప్రాంతంలోని నీళ్లన్నీ నల్లకుంట కాల్వలోకి చేరి జడ్చర్ల- నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతులో నిలిచాయి. ప్రధాన రహదారిపై నుంచి వెళ్లే పాదచారులు నడుములోతు నీటిలో నుంచే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి జడ్చర్లలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి ఆవరణలోకి చేరి చెరువులా తయారైంది. దాంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల తాసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఇరిగేషన్ అధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ ఆసుపత్రిని పరిశీలించారు. బయటినీళ్లు లోపలకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు తాసీల్దార్ సూచించారు.
జడ్చర్ల మున్సిపాటీలో కొద్దిపాటి వర్షం కురిస్తే ఆ నీరం తా ప్రధానరహదారిపై చేరి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తు న్నా పాలకులు, మున్సిపల్ అధికారులు పట్టనట్టు ఉంటున్నారు. పైభాగం నుంచి అధికమొత్తంలో నీళ్లు ఒకే కాల్వ ద్వారా కిందకు వెళ్లడం జరుగుతుంది. అయితే జడ్చర్ల-నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారి దగ్గర ఉన్న మురుగుకాల్వ చిన్నగా ఉండడంతో అదినిండుకోవడం వలన నీళ్లు రోడ్డుపైకి వస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇలానే జరుగుతున్నా మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని పట్టణ ప్రజ లు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా జడ్చర్ల మున్సిపాలిటీ శి వారులో ఆలూరు రోడ్డులోని రైల్వే అండర్‌బ్రిడ్జి దగ్గర వర్షపునీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మక్తల్ ఆగస్టు 20 : నాణ్యత లేని పనులు చేయడంవల్ల చిన్నపాటి వర్షం కురిస్తే భీమా కెనాల్ కోతకు గురై వందల ఎకరాల పంట నీట మునుగుతంది.మక్తల్ సంగంబండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజయర్లో లెవెల్ లెప్టు కెనాల్ ఇటీవలే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిలు వచ్చి ప్రారంభించారు. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తామే నిధులు తెచ్చి రిజర్వాయర్‌ను నిర్మించినట్లు గొప్పలు చెప్పి నాణ్యత లేని పనులు చేయించారు.
కొద్దిపాటి వర్షానికి కెనాల్ కోతకు గురై వందల ఎకారాలు నీట మునుగుతుందడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్త్తున్నారు. లెప్టు కెనాల్ ద్వారా మక్తల్ మండలంలోని గుర్లపల్లి, వనయకుంట, దాసరిదొడ్డి, మాగనూర్ మండలంలోని మాగనూర్, ఓబుల్లాపూర్, వడ్వాట్ గ్రామాల చెరువులు నింపడంతో పాటు 5900 ఎకారల సాగునీరు అందివ్వాలనే ఉద్దేశంతో లెప్టు కెనాల్ ను రూపొందించారు. పనులు నాసిరకం చెయ్యడం వల్ల కాలువ కోతకు గురై వం దల ఎకారాల్లో పంటలు నీటి మునిగి రైతులకు భారీ నష్టం ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వలకు మరమ్మతులు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.