అయిజ, జూలై 21 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాం నీటి మట్టం అంతకంతకూ పెరుగుతున్నది. తుంగనది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది. ఆదివారం ఇన్‌ఫ్లో 1,25,911 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 4,755 క్యూసెక్కులుగా నమోదైంది. టీబీ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులకు గా నూ ప్రస్తుతం 1626.05 అడుగుల నీటి మట్టం ఉన్నది.
డ్యాం గరిష్ఠ నీటి నిల్వ 105.788 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 79.969 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువ నుంచి వరద పెరుగుతుండడంతో ఏపీ, కర్ణాటక కాల్వలకు నీటిని విడుదల చేశారు. అలాగే భారీ వరదల నేపథ్యంలో ఎల్ఎల్సీ కాల్వ ద్వారా తుంగభద్ర నదిలోకి 1,500 క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తె లిపారు. వరద నీటి చేరికతో నేడో రేపో నీటి విడుదలను మ రింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.