కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాం నీటి మట్టం అంతకంతకూ పెరుగుతున్నది. తుంగనది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది.
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటలకు 44 అడుగలకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.