కృష్ణానదితీర ప్రాంతంలో నిషేధిత అలవి వలలతో చేపలు పడుతున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్నున్నది. స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి గండి కొట్టే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. నిషేధిత వలలతో చేపలు పడుతున్నట్లు ఫిర్యాదులు అందితే రెవెన్యూ, పోలీస్ శాఖాధికారులతో కలిసి దాడులు చేస్తాం.. కేసులు నమోదు చేస్తాం..
– రమాదేవి, జిల్లా మత్స్యశాఖాధికారి, నాగర్కర్నూల్
పెంట్లవెల్లి, నవంబర్ 15 : కృష్ణానదిలో నిషేధిత వలలతో ఆం ధ్రా జాలర్లు చేపల వేట కొనసాగిస్తున్నారు. తెలంగాణలోని రూ. కోట్ల సంపదను ఏపీకి దోచుకెళ్తున్నారు. ఇక్కడి నుంచి మన చేపలను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు ముడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నా యి. దీంతో ఆంధ్రా జాలర్లు యథేచ్ఛగా అక్రమ దందాకు తెరలేపారు.
కృష్ణానదిలో అలవి వ లలతో ఆంధ్రా, సీమ జాలర్లు చేపల వేట కొనసాగిస్తున్నారని స్థానిక మ త్స్యకారులు పలుమార్లు అభ్యంత రం వ్యక్తం చేశారు. అయినా భయపడేదే లేదన్నట్లు వారి వేటను మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై మత్స్య శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మన మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
అధికార పార్టీ నాయకుల అండదండలతో పాటు మత్స్య, పో లీస్ శాఖలకు సంబంధించి కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు భారీగా ముడుపులు అందడమే ఇందుకు కారణమని ఆరోపణలు ఉన్నా యి. ప్రతి ఏటా పేరుకు మాత్రమే తనిఖీలు చేస్తున్నారని, దాడులు చేయాల్సి వస్తే సంబంధిత దళారుల కు ఫోన్ ద్వారా ముందస్తు సమాచారం అందుతుండడంతో వైజాగ్ జాలర్లతో పాటు నిషేధిత వలలను రహస్య ప్రాంతాలకు త రలించేందుకు సహకారం అందిస్తున్నారన్న విమర్శలు గు ప్పుమంటున్నాయి.
కృష్ణానది తీర గ్రామాల్లో దళారులు తమ హద్దుబందులోని స్థలానికి (పట్టుకు) ఏటా వేలం నిర్వహిస్తారు. హద్దు(పట్టు)ను బట్టి రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తమ స్థలాన్ని వేలంలో లీజుకు ఇస్తారు. వేలం రెండు నెలల ముందే నిర్వహించి ఆంధ్రా జాలర్ల వ ద్ద అడ్వాన్స్ తీసుకుంటారు. స్థానిక దళారులతో చేతులు కలిపి సం బంధిత అధికారులతో మంతనాలు జరిపిన అనంతరం వివిధ శా ఖాధికారులకు రూ.లక్షల్లో ముడుపులిచ్చాక వారితో హామీ తీసుకొ ని నిషేధిత వలలతో వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థా నిక మత్స్యకారులు కోరుతున్నారు.